మటన్ తిన్న తర్వాత తేనె తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. సాధారణంగా తేనె శరీరంలో వేడిని పెంచుతుంది. దానిని మటన్‌తో కలిపి తిన్నప్పుడు, శరీరంలో వేడి మరింత పెరుగుతుంది. దీనివల్ల గుండెల్లో మంట, శారీరక అసౌకర్యం కలగవచ్చు. అందువల్ల, మీకు మటన్ తిన్న తర్వాత తేనె తినే అలవాటు ఉంటే, వెంటనే దానిని మానుకోండి.
స్వీట్స్..
అంతేకాకుండా, మటన్ తిన్న తర్వాత అరటిపండ్లు, స్వీట్లు తినకూడదు. మనం తినే మటన్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది కాబట్టి, వీటిని వెంటనే తినడం వల్ల కడుపులో సమస్యలు వచ్చి, మీకు అనారోగ్యంగా అనిపించవచ్చు. కాబట్టి, మటన్ తిన్న తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత మీకు నచ్చింది తినవచ్చు.
రాత్రిపూట మటన్ తినడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. మటన్ తిన్న తర్వాత తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం. తిన్న తర్వాత మీ కడుపు చాలా బరువుగా అనిపిస్తే, అల్లం లేదా మెంతుల కషాయం తాగమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.