6. కూరగాయల సహజ రంగు చెడిపోకుండా:
పులావ్‌లో వేసే ఆకుకూరలు లేదా బీన్స్ ఉడికించేటప్పుడు ఉప్పు వేస్తే వాటి రంగు మారకుండా తాజాగా మెరుస్తుంటాయి. కూరగాయలు సమానంగా ఉడికి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
7. పచ్చళ్లు, పిండి పులియబెట్టడంలో కీలక పాత్ర:
మామిడికాయ పచ్చడి నుండి దోశ పిండి వరకు ఉప్పు లీడ్ రోల్ పోషిస్తుంది. ఇది అదనపు తేమను లాగేసి, చెడిపోయేలా చేసే బ్యాక్టీరియాని అడ్డుకుంటుంది. పర్ఫెక్ట్ పులియబెట్టడానికి తగినంత ఉప్పు కచ్చితంగా ఉండాల్సిందే.
8. చేదు కాఫీ, మాడిపోయిన కూరకు చెక్:
కాఫీ చాలా చేదుగా అనిపిస్తే చిటికెడు ఉప్పు కలపండి, రుచి మారిపోతుంది. ఒకవేళ కూర మాడిపోతే కొద్దిగా ఉప్పు, తాజా కొత్తిమీర వేయండి.. ఆ వాసన తగ్గి కూర మళ్లీ తినడానికి వీలుగా మారుతుంది.
9. స్నాక్స్ ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా:
ఇంట్లో చేసుకున్న చిప్స్, చెక్లీలు ఒక్క రోజులోనే మెత్తగా మారిపోతూ ఉంటాయి. వేయించిన వెంటనే వాటిపై లైట్‌గా ఉప్పు చల్లితే తేమను దరిచేరనివ్వవు. చట్నీలు కూడా ఉప్పు ఎక్కువగా ఉంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.