ప్రపంచంలో అత్యంత ధనవంతులు నివసించే దేశం అమెరికానో, దుబాయ్, యూకే వంటి దేశాలు కాదు. మీరు ఎవ్వరూ ఊహించని దేశం ఇది. ఆ దేశమంతా నడుచుకుంటూ గంటలో చూసేయచ్చు. ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో ఇది ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఆ దేశ ఆర్థిక శక్తి, టెక్నాలజీ చూస్తే ఆశ్చర్యపోతారు. ఐరోపాలోని చిన్న దేశమైన మొనాకో ప్రపంచ కుబేరులకు నిలయంగా మారింది.