LPG: ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ వాడుతారు స‌రే.. మ‌రి క‌రెంట్ బిల్ త‌క్కువ రావాలంటే ఏం చేయాలో తెలుసా.?

Published : Mar 15, 2026, 10:58 AM IST

LPG: ఎల్పీజీ గ్యాస్ కొర‌త నేప‌థ్యంలో చాలా మంది ఇండ‌క్ష‌న్ స్ట‌వ్‌ల‌ను ఉప‌యోగిస్తున్నారు. అయితే ఇండక్షన్ స్టవ్ ఉపయోగిస్తే కరెంట్ బిల్లు ఎక్కువ వ‌స్తుంది. మ‌రి ఈ స్ట‌వ్‌ల‌ను ఎలా ఉప‌యోగిస్తే క‌రెంట్ బిల్లు త‌క్కువ వ‌స్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
ఇంతకీ ఇండక్షన్ స్టవ్ ఎలా పనిచేస్తుంది?

ముందుగా ఇండక్షన్ స్టవ్ పని విధానం తెలుసుకోవడం అవసరం. గ్యాస్ స్టవ్‌లా మంట రాకుండా, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి ఆధారంగా పనిచేస్తుంది. స్టవ్ లోపల ఉండే కాపర్ కాయిల్ మాగ్నెటిక్ ఫీల్డ్ సృష్టిస్తుంది. ఆపై స్టవ్‌పై ఇనుము లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్ర ఉంచితే ఆ మాగ్నెటిక్ ఫీల్డ్ పాత్రలోని అణువులను కదిలిస్తుంది. ఆ ప్రక్రియ వల్ల వేడి నేరుగా పాత్రలోనే ఉత్పత్తి అవుతుంది. అంటే స్టవ్ ఉపరితలంపై కాకుండా పాత్రలోనే వేడి ఏర్పడుతుంది. అందుకే ఇండక్షన్ స్టవ్‌లు త్వరగా వంట పూర్తిచేస్తాయి, అలాగే ప‌వ‌ర్‌ వృథా తక్కువగా ఉంటుంది.

25
సరైన పాత్రలు ఉప‌యోగించాలి

ఇండక్షన్ స్టవ్‌లో అన్ని పాత్రలు పనిచేయవు. ఇండక్షన్‌కు అనుకూలమైన పాత్రలు మాత్రమే వాడాలి. ముఖ్యంగా స్టెయిన్‌లెస్ స్టీల్, కాస్ట్ ఐరన్, ఇండక్షన్ బేస్ పాత్రలను ఉప‌యోగించాలి. పాత్ర అడుగు భాగం సమతలంగా (ఫ్లాట్‌గా) ఉండాలి. వంకరగా లేదా చాలా పలుచగా ఉన్న పాత్రలు వాడితే వేడి సరిగా పాకదు. దీంతో వంటకు ఎక్కువ సమయం పడుతుంది, విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది.

35
మూత పెట్టి వండాలి

వంట చేసేప్పుడు క‌చ్చితంగా మూత పెట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వేడి బయటకు పోకుండా ఉంటుంది, ఆహారం త్వరగా ఉడుకుతుంది, వంట సమయం తగ్గుతుంది. దీంతో ఇండక్షన్ స్టవ్ ఎక్కువసేపు పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా విద్యుత్ వినియోగం తగ్గుతుంది.

45
సరైన టెంప‌రేచ‌ర్

ఇండక్షన్ స్టవ్‌లో టెంపరేచర్ నియంత్రణ చాలా సులభం. కానీ అవసరం లేకుండా ఎక్కువ హీట్‌లో వంట చేస్తే విద్యుత్ వృథా అవుతుంది. వంట చేసేటప్పుడు మొదట మధ్యస్థ హీట్ ఉపయోగించాలి, అవసరమైతే మాత్రమే హై హీట్ పెట్టాలి. వంట పూర్తికాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే అవసరానికి మించి విద్యుత్ వినియోగం జరగదు.

55
వంటను ప్లాన్ చేస్తే బిల్లు తగ్గుతుంది

ఇండక్షన్ స్టవ్ ఉపయోగించే వారు ఒకేసారి అనేక వంటలు చేయడం మంచిది. ఇలా చేస్తే స్టవ్‌ను మళ్లీ మళ్లీ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే స్టవ్ గ్లాస్ ప్లేట్‌ను శుభ్రంగా ఉంచాలి, పాత్ర పరిమాణం స్టవ్ హీట్ జోన్‌కు సరిపోవాలి, అవసరం లేని ప్రీహీటింగ్ చేయకూడదు. ఇలా వంటను కొంచెం ప్లాన్ చేసి చేస్తే ఇండక్షన్ స్టవ్ వాడినా విద్యుత్ బిల్లు ఎక్కువగా రాకుండా నియంత్రించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories