First Kiss: మొదటి ముద్దు ఎవరు ఎవరికి పెట్టారు? ఫస్ట్ కిస్ చరిత్ర ఇదే

Published : Mar 15, 2026, 10:54 AM IST

First Kiss: ప్రేమకు, రొమాన్స్‌ మొదలయ్యేది ముద్దుతోనే. ముద్దు అనేక రకాలు. ఏ రకమైన ముద్దయినా కూడా మొదట పెట్టింది మాత్రం మనిషి కాదు. దీని లక్షల ఏళ్ల చరిత్ర ఉంది. ఇక మొదటి ముద్దు పెట్టింది ఎవరో తెలుసా?

PREV
14
ముద్దు ఎంత ముఖ్యమో

మనిషి జీవితంలో ముద్దు ఎంతో ముఖ్యమైనది. ఒక వ్యక్తిపై ఉన్న అనురాగం, ప్రేమ చూపించేందుకు ముద్దే ప్రధాన మార్గం. ముద్దు ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. మాటలతో చెప్పలేని ఎన్నో భావాలు ఒక్క ముద్దుతో చెప్పేయచ్చు. దంపతులు, ప్రేమికులు, తల్లీ బిడ్డలు ఇలా వ్యక్తులను బట్టి పెట్టే ముందు అర్థం కూడా మారిపోతుంది. తల్లి బిడ్డకు ముద్దు పెడితే చాలు అతనిలో ఉన్న అభద్రతా భావం, భయం అన్నీ పోతాయి. అయితే మొదటి ముద్దు ఎవరు? ఎప్పుడు పెట్టారో తెలుసా? మీరు ఊహించలేరు. ఇక ప్రేమ, రొమాన్స్‌లో ముద్దు చాలా ముఖ్యం. లిప్ కిస్, ఫ్రెంచ్ కిస్ వంటివి బాగా పాపులర్. అయితే ఈ అలవాటు మనుషుల్లో పుట్టలేదు.

24
అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

మొదటి ముద్దుపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కొన్ని పరిశోధనలు జరిగాయి. ఇక అధ్యయనకర్తలు చెప్పిన ప్రకారం ముద్దు ఈనాటిది కాదు. మనిషి పుట్టక ముందే ముద్దు పుట్టింది. ముద్దుకు 1.6 నుంచి 2.1 కోట్ల ఏళ్ల చరిత్ర ఉంది. 

34
మొదటి ముద్దు పెట్టింది ఎవరు?

మనిషి కన్నా  ముందే ముద్దు పుట్టింది. మరి ఎవరు ముద్దులు పెట్టుకోవడం మొదలుపెట్టారు. మనిషి కోతి నుంచి వచ్చాడని అందరికీ తెలుసు. మనిషికి ఆవిర్భావానికి కారణమైన చింపాంజీలు, ఒరాంగుటాన్లు ముద్దులు పెట్టుకునేవి. తమ బిడ్డలను ముద్దాడేవి. కేవలం వాటి నోటికి ఆహారాన్ని అందించేటప్పుడు కూడా తమ ప్రేమను వాటిపై చూపించేందుకు నోటితో బిడ్డల నోటిని తాకేవి. మానవ పూర్వీకులైన నియాండర్తల్స్ ముద్దు పెట్టుకున్నారని ఆధారాలున్నాయి.  కొన్ని కోతి జాతులు అప్పట్లో నాలుకను వాడుతూ ఎక్కువసేపు ముద్దు పెట్టుకుంటాయి. గొరిల్లాలు మాత్రం చాలా తక్కువగా ముద్దు పెట్టుకుంటాయి. గొడవపడిన తర్వాత చింపాంజీలు ఒకరినొకరు ముద్దు పెట్టుకుని శాంతిస్తాయి. బంధాలను బలపర్చుకోవడానికి, లైంగిక ప్రేరేపణ కోసం కూడా కోతి జాతులు ముద్దాడుకునేవి.

44
ఎన్ని మారినా ముద్దు మారలేదు

మానవ పరిణామ క్రమంలో ఎన్నో మారేవి. కానీ ముద్దు మాత్రం కొనసాగింది. ఇప్పుడు మనుషుల రొమాన్స్‌లో ముద్దు ఎంతో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ముద్దు అనేది  2.1 కోట్ల ఏళ్ల నాటి సంప్రదాయం.  ముద్దు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒత్తిడి ఉఫ్ మని ఎగిరిపోతుంది. టెన్షన్ కూడా తగ్గుతుంది. ముద్దు పెట్టుకునేటప్పుడు డోపమైన్, సెరోటోనిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి సంతోషంగా ఉన్న ఫీల్ ను అందిస్తాయి. గుండె వేగం పెరిగి గుండెకు రక్తప్రసరణ పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories