ఈ వ్యాధులతో బాధపడుతున్నారా.? స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గుతున్నట్లే..

First Published | Dec 22, 2024, 5:12 PM IST

ఒకప్పుడు సంతానలేమి సమస్య అంటే కేవలం మహిళలకే పరిమితం అనుకునే వారు, కానీ ప్రస్తుతం పురుషుల్లోనూ సంతానలేమి సమస్యలు వస్తున్నాయి. శుక్ర కణాల నాణ్యత తగ్గడం, స్పెర్మ్‌ కౌంట్ తగ్గడం వంటి సమస్యలు ఎక్కువుతున్నాయి. కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారిలో స్పెర్మ్‌ కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.. 
 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో సంతానలేమి సమస్యలు తీవ్రమవుతున్నాయి. పురుషుల్లో స్పెర్మ్‌ కౌంట్ వేగంగా తగ్గుతుంది. భారతీయుల్లోనూ ఈ సమస్య క్రమంగా పెరుగుతోంది. హ్యూమన్‌ రిప్రొడక్షన్‌ అప్‌డేట్ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం గడిచిన 45 ఏళ్లలో పురుషుల్లో స్పెర్మ్‌కౌంట్ సగానికి పైగా తగ్గిందని తేలింది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. 
 

కొన్ని కారణాలు..

పురుషుల్లో స్పెర్మ్‌ కౌంట్ తగ్గడానికి ఎండోక్రైన్‌కు అంతరాయం కలిగించే రసాయనాలు గాలి, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇవి శుక్రకణాలను ప్రభావం చేసే హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాలుష్యం కూడా పురుషుల స్పెర్మ్‌ కౌంట్ తగ్గుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగే ఊబకాయం కూడా శుక్రకణాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు అధిక ధూమపానం, ఆల్కహాల్‌ సేవించడం వల్ల కూడా స్పెర్మ్‌ కౌంట్ తగ్గుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. 
 


వ్యాధులు..

వీటితో పాటు కొన్ని రకాల వ్యాధులు కూడా స్పెర్మ్‌ కౌంట్‌పై ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వరికోసెల్‌ అనే వ్యాధితో బాధపడేవారిలో స్పెర్మ్‌ కౌంట్ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. వృషణాలలోని రక్తనాళాలు వాచిపోవడాన్ని వరికోసెల్‌గా చెబుతుంటారు. వేరికోసెల్ కారణంగా వృషణాల్లో రక్త ప్రవాహం తగ్గుతుంది. ఇది స్పెర్మ్‌ కౌంట్ నాణ్యతను తగ్గిస్తుంది. వీటితోపాటు ప్రైవేట్ భాగాల్లో ఇన్ఫెక్షన్‌, గోనేరియా, డయాబెటిస్‌ వంటి వ్యాధులతో బాధపడేవారిలో కూడా స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇక హైపోథైరాయిడిజం, ప్రోస్టేట్‌ సమస్య, అధిక రక్తపోటు, డిప్రెసన్‌, కిడ్నీ, లివర్‌, అల్సర్‌ సంబంధిత సమస్యలకు ఉపయోగించే మందుల కారణంగా కూడా స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 
 

ఇవి పాటించండి..

పురుషుల్లో స్పెర్మ్‌ కౌంట్ పెరగాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తీసుకునే ఆహారం మొదలు జీవనశైలి వరకు పలు మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పురుగుల మందులు ఉపయోగించి పండించిన పంటలు కాకుండా సేంద్రీయ వస్తువులను తీసుకోవాలి. ప్లాస్టిక్‌ వస్తువుల్లో ఉండే ఫుడ్‌ను నీటికి దూరంగా ఉండాలి. అలాగే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు చిట్కాలు పాటించాలి. ముఖ్యంగా ఒత్తిడిని దూరం చేసుకునేందుకు యోగా, మడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 
 

తీసుకునే ఆహారంలో మార్పులు..

స్పెర్మ్‌కౌంట్‌ పెరగాలంటే తీసుకునే ఆహారంలో అరటిపండు, దానిమ్మను బాగం చేసుకోవాలి. అరటి పండులో ఉండే విటమిన్ ఎ, బి1 , సి పుష్కలంగా ఉంటాయి. ఇది శుక్ర కణాల ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే దానిమ్మ హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచుతుంది. ఇది శుక్ర కణాల నాణ్యతతతో పాటు, చలనశీలత పెంచేందుకు సహాయపడతాయి. స్పెర్మ్‌ ఉత్పత్తిని పెంచడంలో క్యారెట్‌ కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. టొమాటోలోని లైకోపీన్‌ స్పెర్మ్‌ ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 
 

Latest Videos

click me!