Foods for Long Hair: పొడవాటి, ఒత్తయిన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందులో మీరు కొన్ని ప్రత్యేకమైన ఫుడ్ కాంబినేషన్స్ తినడం వల్ల జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయవచ్చు. ఈ ఆహారాల కలయిక మీ ఆరోగ్యంతో పాటు అందమైన జుట్టును కూడా అందిస్తుంది.
జుట్టు ఊడిపోయే సమస్యతో బాధపడే వారు ఇప్పుడు కోట్లలో ఉన్నారు. అనేక ఆరోగ్య సమస్యల వల్ల, కాలుష్యం, పోషకాహారం లోపం వంటి కారణాల వల్ల జుట్టు రాలిపోతోంది. సరైన ఆహారాలను కలిపి తీసుకుంటే జుట్టు పెరిగే అవకాశం ఉంది. ఈ ఆహారం రక్త ప్రసరణ, హార్మోన్ల సమతుల్యం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడతాయి. ఇవన్నీ జుట్టు రాలడం, జుట్టు తెల్లబడటం, చుండ్రు, జుట్టు పలచబడటం వంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఎలాంటి ఆహార కాంబినేషన్లు తినాలో తెలుసుకోండి.
26
మజ్జిగ, కరివేపాకులు
ప్రతి ఇంట్లోనూ మజ్జిగ ఉంటుంది. మజ్జిగలో గుప్పెడు కరివేపాకులు వేసి అరగంటపాటూ నానబెట్టి తరువాత తాగాలి. ఇలా తాగడం వల్ల ఐరన్, ప్రోబయోటిక్స్ రెండూ శరీరానికి అందుతాయి. ఈ డ్రింక్ మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అకాలంగా జుట్టు తెల్లబడే సమస్య రాకుండా ఇది అడ్డుకుంటుంది. వారంలో కనీసం రెండు మూడు సార్లు ఈ పానీయం తాగితే మంచిది.
36
పాలకూర, నిమ్మకాయ
పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే ఆకుకూర. ఇక నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి మీ శరీరం ఆహారం నుంచి ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది. పాలకూరపై నిమ్మరసం చల్లుకుని తింటే ఎంతో మంచిది. ఇందులోని ఐరన్, ఆక్సిజన్, ఫోలిసెల్స్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. పాలకూరపై నిమ్మరసం చల్లుకుని తినడం ఇప్పుడే మొదలుపెట్టండి.
రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు బీట్‌రూట్ కచ్చితంగా తినాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇక చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలను అందిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల జుట్టుకు ఎంతో మేలు జరుగుతుంది. ఇవి రెండూ కలిసి తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, జుట్టును ఒత్తుగా చేస్తాయి. కాబట్టి తరచూ బీట్ రూట్ సలాడ్ లో చియా విత్తనాలు కలిపి తింటూ ఉండండి. కొన్ని రోజుల్లోనే మీకు ఫలితం కనిపిస్తుంది.
56
అరటిపండు, అవిసెగింజలు
ఈ రెండూ కూడా చాలా తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తాయి. అరటి పండ్లు, అవిసెగింజలు కలిపి తినడం వల్ల పొటాషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతాయి. ఇవి తలలో నూనె సమతుల్యతను, వాపును నియంత్రించడంలో సాయపడతాయి. అధికంగా జుట్టు రాలడాన్ని నివారించడానికి ఇది ఉత్తమమైన ఆహారం అని చెప్పుకోవాలి. అలాగే క్యారెట్ జ్యూస్, వాలనట్స్ కలిపి తిన్నా ఎంతో మంచిది. ఈ రెండింటి నుంచి విటమిన్ ఎ, బయోటిన్, ఒమెగా3 ఫ్యాలీ ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి.
66
పెరుగు, మెంతులు
మెంతులను పెరుగులో వేసి నానబెట్టుకోవాలి. తరువాత వాటిని నేరుగా తినేయాలి. ఇలా చేయడం వల్ల పేగుల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే మంచి జీర్ణక్రియ, పోషకాల సరఫరా కూడా జరుగుుతంది. తలపై ఉన్న చుండ్రు, దురద తగ్గడానికి ఈ ఆహారం సహకరిస్తుంది. అలాగే నెయ్యిలో ముంచిన ఖర్జూరం తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రెండింటి కలయిక జుట్టు రాలడం, పొడిబారడం, బలహీనమైన జుట్టు సమస్యను నివారిస్తుంది. ఒత్తైన జుట్టు పెరుగుదలకు సాయపడుతుంది.