ఈ ఆలయం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నవోగావ్ సమీపంలోని కాశీపూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు చెబుతున్న ప్రకారం కాళీమాతను విగ్రహంగా కాకుండా జీవంతో ఉన్న శక్తిగా భావిస్తారు. రాత్రి సమయంలో భక్తులు నిద్రలో ఉండగా దేవి వారి సమస్యలు తెలుసుకుని వాటిని తీర్చేందుకు వెళ్లి వస్తుందని నమ్మకం. అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఉద్యోగ ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు వంటి వాటితో బాధపడేవారు ఈ ఆలయానికి వచ్చి మొక్కుకుంటే తమ సమస్యలు తగ్గాయని కొందరు చెబుతున్నారు. అందుకే ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించి పూజలు చేస్తుంటారు. ఆ కాళీ మాత తమ మాట వింటుందని, తమ బాధలు అర్థం చేసుకుంటుందని వారు నమ్ముతున్నారు.