ఈత కల్లు సహజ శక్తి పానీయంగా భావిస్తారు. ఫ్రెష్‌గా తీసుకున్నప్పుడు శరీరానికి తేలికగా జీర్ణమవుతుంది. సహజ చక్కెరల వల్ల శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉండే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. డీహైడ్రేషన్ తగ్గించడంలో సహాయపడుతుందని గ్రామీణ ప్రజలు విశ్వసిస్తారు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కొంతమేర ఉపయోగపడుతుందని చెబుతారు. ఫ్రెష్‌గా ఉన్న ఈత కల్లు తాగితే శరీరానికి తేలికపాటి చల్లదనం కలిగిస్తుంది.
ఏది మంచిది? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.?
తాటి కల్లు అయినా, ఈత కల్లు అయినా రెండూ చెట్ల నుంచి లభించే సహజ పానీయాలే. కానీ వీటిని ఎక్కువసేపు ఉంచితే ఫెర్మెంటేషన్ జరిగి ఆల్కహాల్ శాతం పెరుగుతుంది. అలాంటి సమయంలో తాగితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చు. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లివర్‌పై ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. బాగా పులిసిన కల్లు తాగితే వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశముంది. కాబట్టి ఫ్రెష్‌గా ఉన్నప్పుడు మాత్రమే మితంగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మొత్తానికి చూస్తే తాటి కల్లు, ఈత కల్లు రెండింటికీ ప్రత్యేక రుచి, లక్షణాలు ఉంటాయి. ఏది మంచిదో అనేది వ్యక్తిగత అభిరుచి, తీసుకునే పరిమాణం, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సరైన మోతాదులో తీసుకుంటే ఈ సంప్రదాయ పానీయాలు శరీరానికి కొంతమేర ప్రయోజనం ఇవ్వగలవు.
గమనిక: పైన తెలిపిన విషయాలు వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.