Wardrobe: బీరువాలో చెదలతో మీ పట్టుచీరలు పాడవుతున్నాయా? అయితే ఇలా చేయండి

Published : Mar 28, 2026, 06:19 PM IST

Wardrobe: బీరువాలో ఒక్కసారి చెదలు పట్టాయంటే అవి క్లీన్ చేయడం చాలా పెద్ద పని. అంతేకాదు దాంట్లో ఉన్న ఖరీదైన పట్టుచీరలు, బట్టలు నాశనమవుతాయి. మరి ఆ సమస్యకు చెక్ పెట్టాలంటే..ఇలా ట్రై చేయండి. 

PREV
15
చెద తరిమికొట్టే మార్గాలు

ఒక్కసారి చెదలు పట్టాయంటే బీరువా పోవడంతో పాటు బట్టలు కూడా పాడవుతాయి. బీరువా అంటేనే ఖరీదైన పట్టుచీరలు, జరీ బట్టలు జాగ్రత్తగా దాచుకునా లాకర్ లాంటిది. కానీ ఒకవేళ బీరువా చెక్కదైతే చెదలు పట్టే అవకాశం ఉంది. సాధారణంగా బీరువా గోడకు ఆనించి ఉంచడం వల్ల చేరే తేమ, లేదా పాత పేపర్ల వాసన చెదలను ఆకర్షిస్తాయి. మరి ఈ సమస్యకు చెక్ పెట్టడం ఎలాగో చూద్దాం. 

25
వేప నూనె లేదా ఆకులు

వేపలో ఉండే చేదు... చెదలకు శత్రువు. బీరువా అరలను శుభ్రం చేసి, వేప నూనెను ఒక కాటన్ బాల్‌తో మూలల్లో రాయండి. ఎండిన వేపాకులను చిన్న పొట్లాలుగా కట్టి చీరల మధ్య ఉంచండి. లేదా లవంగాలు , దాల్చిన చెక్క ఘాటైన వాసన కీటకాలను దరిచేరనీయదు. లవంగాలను ఒక పలచని వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచితే మంచి సువాసన రావడంతో పాటు చెదలు రావు. 

35
పట్టుచీరలను ఇలా దాచుకోండి

పట్టుచీరలను ఎప్పుడూ ప్లాస్టిక్ కవర్లలో పెట్టకండి. దీనివల్ల గాలి ఆడక తేమ చేరుతుంది. వీటికి బదులుగా తెల్లటి కాటన్ క్లాత్‍లో చుట్టి బ్యాగుల్లో భద్రపరచండి.ప్రతి 3 నెలలకు ఒకసారి చీరలను బయటకు తీసి, మడతలు మార్చి మళ్లీ సర్దుకోవాలి. దీనివల్ల మడతల్లో పట్టు దారాలు తెగిపోకుండా ఉంటాయి. అలానే ఉంచేయడం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది.

45
బీరువా మెయింటెన్స్

బీరువాను ఎప్పుడూ గోడకు పూర్తిగా ఆనించి ఉంచకండి. కనీసం రెండు అంగుళాల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల గాలి ప్రసరణ జరిగి తేమ చేరదు. చాలామంది బీరువా అరల్లో న్యూస్ పేపర్లు వేస్తారు. పాత పేపర్లలోని సిరా వాసనకు చెదలు ఇంకా త్వరగా వస్తాయి. వీటికి బదులుగా బ్రౌన్ పేపర్ లేదా క్లాత్ లైనింగ్ వాడటం ఉత్తమం.

55
బోరిక్ యాసిడ్ చల్లండి

ఒకవేళ చెదలు ఇప్పటికే పట్టినట్లయితే, బోరిక్ యాసిడ్ పౌడర్‌ను బీరువా అడుగు భాగంలో చల్లండి. ఇది చెదలను వేళ్లతో సహా అంతం చేస్తుంది. అలాగే నాఫ్తలీన్ బాల్స్ వాడేటప్పుడు అవి నేరుగా పట్టుచీరలకు తగలకుండా జాగ్రత్త వహించండి.

Read more Photos on
click me!

Recommended Stories