ప్రస్తుతం షుగర్ వ్యాధి చాలా సాధారణం అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒక్కసారి షుగర్ వస్తే ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా చక్కెర ఉన్న పదార్థాలు అస్సలు తినకూడదు. కానీ షుగర్ కంట్రోల్లో ఉండే స్వీట్లు కూడా ఉన్నాయి. అవెంటో ఇప్పుడు చూద్దాం.
షుగర్ పేషెంట్లు ఏ స్వీట్లు తినచ్చు?
బాదం సందేశ్, అంజీర్ బర్ఫీ
షుగర్ పేషెంట్లు మితంగా కొన్ని రకాల స్వీట్లు తినవచ్చు. వాటిలో బాదం సందేశ్, అంజీర్ బర్ఫీ ముందు వరుసలో ఉంటాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు.
కొబ్బరి లడ్డు
కొబ్బరి లడ్డూ కూడా తినవచ్చు. చక్కెరకు బదులు ఖర్జూరంతో లడ్డూ చేసుకోవడం మంచిది. ఇవి షుగర్ ని పెంచవు. కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
డార్క్ చాక్లెట్ స్వీట్స్
డార్క్ చాక్లెట్ తో చేసిన కొన్నిరకాల స్వీట్స్ మితంగా తినవచ్చు. వీటిలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇవి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. వీటిలో జీడిపప్పు, బాదం కూడా ఉంటాయి.
బజ్రా హల్వా
బజ్రా హల్వాను కూడా మితంగా తినవచ్చు. దీన్ని బెల్లం లేదా ఖర్జూరంతో తయారు చేస్తారు. ఇది ఫైబర్, పోషకాలతో నిండి ఉంటుంది. ఇది షుగర్ ని అంతగా పెంచదట.
ఫ్రూట్ చాట్
షుగర్ పేషెంట్లు ఫ్రూట్ చాట్ కూడా తినవచ్చు. ఆపిల్, నారింజ, దానిమ్మ వంటి పండ్లతో దీన్ని తయారు చేస్తారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు.