cockroach in kitchen
మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంగా ఉండాలి. ఇంట్లో వండిన ఆహారం అయినా అది హెల్దీగా ఉండాలంటే.. మనం వంట చేసే కిచెన్ శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనం కిచెన్ నీట్ గా ఉంచుకోకపోతే బొద్దింకలు పుట్టుకువస్తాయి. ఒక్క బొద్దింక వచ్చినా.. ఇంటి మొత్తాన్ని పాడు చేస్తాయి. వీటి వల్ల మనకు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. మరి.. ఈ బొద్దింకలను ఎలా తరిమి కొట్టాలి? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..
శుభ్రత ముఖ్యం
వంటగది డ్రాయర్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వెనిగర్, నీళ్ళు కలిపి ఆ మిశ్రమంతో డ్రాయర్లు తుడవాలి. ఇది ఆహార అవశేషాలు, దుర్వాసన తొలగించడానికి సహాయపడుతుంది. తినే పదార్థాలు గాలి చొరబడని డబ్బాల్లో పెట్టాలి. ఇలా చేస్తే బొద్దింకల బాధ తగ్గుతుంది.
సహజసిద్ధ పద్ధతులు
ఎండిన వేపాకులు డ్రాయర్లలో లేదా బొద్దింకలు ఎక్కువగా వచ్చే చోట్ల పెడితే బొద్దింకల బాధ తగ్గుతుంది. వేపాకులు లేదా వేపనూనె కూడా బొద్దింకలను తరిమికొడుతుంది. వేపనూనె కలిపిన నీళ్ళు లేదా స్ప్రే చేస్తే బొద్దింకలు రావు. లవంగాలు, యాలకులు కూడా వాడొచ్చు.
బొద్దింకల మందులు
బొద్దింకలు వస్తే వాటిని తరిమికొట్టే మందులు వాడొచ్చు. తినే పదార్థాలు ఉంచే చోట్ల, శుభ్రంగా లేని చోట్ల బొద్దింకలు ఎక్కువగా వస్తాయి. అందుకే బొద్దింకలు ఎక్కువగా వచ్చే చోట్ల మందులు వాడితే బొద్దింకలను తరిమికొట్టొచ్చు.
లెమన్ స్క్వీజ్ పవర్
నిమ్మరసం ,నీళ్లు కలిపిన ద్రావణంతో డ్రాయర్లు తుడవడం వల్ల దుర్వాసన పోయి బొద్దింకలు దూరంగా ఉంటాయి. నిమ్మలో ఉండే సిట్రస్ వాసన బొద్దింకలకు నచ్చదు.
cockroach
బేకింగ్ సోడా, చెక్కర నీళ్లు
బేకింగ్ సోడా,చక్కెర సమపాళ్లలో కలిపి బొద్దింకలు కనిపించే చోట్ల చల్లండి. చెక్కరకు ఎట్రాక్ట్ అవుతాయి. బేకింగ్ సోడా వాసనకు చచ్చిపోతాయి.
బోరిక్ పౌడర్, పిండి ,తక్కువ మోతాదులో చక్కెర కలిపి చిన్న బాల్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు సంచరించే మూలలు, కుండీల వెనుక, డ్రాయర్ల మూలలలో ఉంచండి. ఇది వాటిని ప్రభావితంగా నియంత్రిస్తుంది.వెల్లుల్లి గుళికలు లేదా వెల్లుల్లి నూనె కలిపిన నీటితో వంటగది మూలలు తుడవాలి. బలమైన వాసన వల్ల బొద్దింకలు దూరంగా ఉంటాయి.