maye musk birthday
Elon Musk Mother Birthday : అతడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తున్న వ్యక్తి. ఎవరి ఊహకూ అందరి అద్భుతాలను ఆవిష్కృతం చేస్తున్న మహామేధావి. భూమిపైనే కాదు ఆకాశంలోనూ అనేక వింతలు, విడ్డూరాలు సృష్టిస్తున్న అరుదైన వ్యక్తి. ఇలా ఈ ప్రపంచానికి అతడు చాలా రకాలుగా తెలుసు. కానీ ఓ కొడుకుగా మాత్రం చాలా తక్కువమందికి తెలుసు. ఇంత గొప్పగా చెబుతున్నది ఎవరిగురించో కాదు... వరల్డ్ రిచ్చెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్ గురించే. ఇంతకాలం అతడిలో ఓ సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ ను మాత్రమే మనమంతా చూసాం... తాజాగా ఓ కొడుకుగా కూడా మస్క్ ఎంత గొప్పోడో ఈ ఒక్క సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిసిపోయింది.
Elon Musk
అమ్మకు హార్ట్ టచింగ్ భర్త్ డే గిప్ట్ ఇచ్చిన మస్క్ :
డిల్లీకి రాజయినా తల్లికి కొడుకే అనే సామెత ఎలాన్ మస్క్ తల్లి మయే మస్క్ కు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించిన తన కొడుకు నుండి వజ్రవైఢూర్యాలు, ఖరీదైన కార్లు గిప్ట్ గా ఆశించలేదు ఆ తల్లి. తన కొడుకు కేవలం పూలు పంపిస్తేనే ఆ తల్లి మనసు పులకించిపోయింది. కొడుకు మస్క్ పంపిన ఆ గిప్ట్ తో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని అందరితోనూ పంచుకున్నారు మయే మస్క్.
ఇంతకూ ఎలాన్ మస్క్ తల్లి మయే మస్క్ కు ఇచ్చిన భర్త్ డే గిప్ట్ ఏంటో తెలుసా? నిలువెత్తు పూలబొకే. 77వ పుట్టినరోజు జరుపుకుంటున్న తల్లికి రంగురంగుల పూల బొకేతో సర్ఫ్రైజ్ చేసాడు మస్క్.
ప్రస్తుతం భారత ఆర్థిక రాజధాని ముంబైలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు మయే మస్క్. ఈ సందర్భంగా తనకోసం కొడుకు నిలువెత్తు పూలబొకే పంపిచాడని చెబుతూ దాంతో దిగిన ఫోటోను పోస్ట్ చేసారు మయే మస్క్. తన కొడుకు ప్రేమతో పంపిన ఈ గిప్ట్ ను మరిచిపోలేనని మయే మస్క్ తెలిపారు.
Elon Musk Mother Birthday
మయే మస్క్ భర్త్ డే
ఎలాన్ మస్క్ తో పాటు ఆయన తోబుట్టువులు తల్లి మయే మస్క్ పుట్టినరోజును ఘనంగా జరుపుతారట. ఈ విషయాన్ని ఆమె తమ ఎక్స్ వేదికన తెలియజేసారు. ప్రతి ఐదేళ్లకోసం తన పుట్టినరోజు పిల్లల చేతులమీదుగా అట్టహాసంగా జరుగుతుందని ఆమె తెలిపారు.
మయే మస్క్ కు ముగ్గురు పిల్లలు సంతానం... ఎలాన్ మస్క్ తో పాటు కింబాల్, టోస్కా. ముగ్గురు పిల్లలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఓసారి మయే మస్క్ భర్త్ డే పార్టీని గ్రాండ్ గా ఏర్పాటు చేస్తారట. ఇలా 70, 65, 60, 55, 50 ఏళ్లలో జరిగిన పుట్టినరోజు పోటోలను ఆమె షేర్ చేసారు.
ఈసారి మాత్రం ముంబైలో మయే మస్క్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు... ఇలా తనకు భారతదేశం పట్ల ఉన్న మక్కువను చాటుకున్నారామె. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎలాన్ మస్క్ తో జరిపిన ఫోన్ సంభాషణ గురించి ఎక్స్ లో ట్వీట్ చేసారు... దీనికి కూడా మయే మస్క్ రియాక్ట్ అయ్యారు.