Chicken Gravy: చికెన్ గ్రేవీ ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు.. టేస్ట్ అదిరిపోద్ది అంతే!

Published : Oct 31, 2026, 04:10 PM IST

Chicken Gravy : రెగ్యులర్ చికెన్ గ్రేవీ తిని బోర్ కొట్టిందా? అయితే ఈ రెసిపీ మీకోసమే. చికెన్ గ్రేవీలో ఈ రెండు పదార్థాలు కలపడం ద్వారా చికెన్ మరింత రుచిగా మారిపోతుంది. మరి మళ్లీ మళ్లీ తినాలనిపించే ఈ చికెన్ గ్రేవీ రెసిపీ గురించి తెలుసుకుందామా…

PREV
16
చింతపండు చికెన్ గ్రేవీ

చికెన్ గ్రేవీ అనగానే టమాట, ఉల్లిపాయ, కొబ్బరి వేసి చేసే రెగ్యులర్ టేస్టే గుర్తొస్తుందా? అయితే ఈసారి కాస్త వెరైటీగా చింతపండు పులుసు పోసి చికెన్ గ్రేవీ చేసి చూడండి. చింతపండు పులుపు, వేయించిన పల్లీల రుచి, మసాలాల ఘాటు కలిసి ఈ గ్రేవీకి అదిరిపోయే టేస్ట్ ఇస్తాయి.

అన్నం, ఇడ్లీ, దోశ, చపాతీ.. ఇలా దేనితో తిన్నా ఈ చింతపండు చికెన్ గ్రేవీ సూపర్ గా ఉంటుంది. ఇంట్లో ఉండే వస్తువులతోనే దీన్ని ఈజీగా వండేయొచ్చు. రొటీన్ చికెన్ గ్రేవీకి బదులు కొత్త టేస్ట్ కావాలనుకునే వాళ్లు ఈ రెసిపీని ట్రై చేయవచ్చు.

26
చింతపండు చికెన్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు

చికెన్ ఉడికించడానికి:

  • చికెన్ - 1/2 కిలో
  • చింతపండు - నిమ్మకాయ సైజు
  • నూనె - 3 టేబుల్ స్పూన్లు
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • కరివేపాకు - కొద్దిగా
  • నీళ్లు - తగినన్ని


మసాలా పేస్ట్ కోసం:

  • పెద్ద ఉల్లిపాయలు - 2
  • పచ్చిమిర్చి - 2
  • కరివేపాకు - 1 రెమ్మ
  • కొత్తిమీర - కొద్దిగా
  • వేయించిన వేరుశనగలు - 2 టేబుల్ స్పూన్లు
  • అల్లం - 1 చిన్న ముక్క
  • వెల్లుల్లి - 6 రెబ్బలు
  • ఉప్పు - తగినంత
  • మిరియాల పొడి - 1/2 టీస్పూన్
  • ధనియాల పొడి - 2 టీస్పూన్లు
  • గరం మసాలా - 1 టీస్పూన్
  • కారం - 1 టీస్పూన్
  • నీళ్లు - తగినన్ని
36
చింతపండు చికెన్ గ్రేవీ తయారీ విధానం

ముందుగా మిక్సీ జార్ లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, వేయించిన వేరుశనగలు, అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. అందులోనే ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే చింతపండును వేడి నీళ్లలో నానబెట్టి పులుసు తీసి వడకట్టుకోవాలి.

46
మసాలా వేయించడం

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి మంటను మీడియంలో పెట్టి బాగా వేయించాలి. మసాలా పచ్చివాసన పోయి, నూనె పైకి తేలేవరకు వేయిస్తే గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది.

56
చికెన్ వేసి ఉడికించడం

ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను కడాయిలో వేయాలి. మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టేలా 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంట మీద ఉడికించాలి.

66
చింతపండు పులుసు కలపడం

చికెన్ సగం ఉడికాక, వడకట్టి పెట్టుకున్న చింతపండు పులుసును చికెన్ గ్రేవీలో పోసి బాగా కలపాలి. పులుసు పోశాక మరో 2 నిమిషాలు మరగనివ్వాలి. ఆ తర్వాత చికెన్ పూర్తిగా ఉడికి, గ్రేవీ చిక్కబడే వరకు మీడియం మంట మీదే ఉడికించాలి. గ్రేవీ బాగా చిక్కబడ్డాక పైన కొద్దిగా కరివేపాకు చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చింతపండు చికెన్ గ్రేవీ రెడీ అయిపోయినట్లే.

Read more Photos on
click me!

Recommended Stories