తాజా వస్తువులు...
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, పాలు, కూరగాయలు కొనుక్కోవడంలో తప్పు లేదు.కానీ, వీటని బల్క్ లో అస్సలు కొనకూడదు. తక్కువ ధరకు వస్తున్నాయని పెద్ద సంచి నిండా యాపిల్స్, టమాటలు, పాలు, పెరుగు లాంటివి కొనుగోలు చేస్తే.. అవి తొందరగా పాడైపోతాయి. ఇవి చాలా తొందరగా పాడైపోతాయి కాబట్టి.. అవసరం అయినంత వరకు మాత్రమే కొనుక్కోవాలి, అయిపోయాకక మళ్లీ తాజాగా కొని తెచ్చుకోవడం తెలివైన పని.
మసాలా దినుసులు...
మన భారతీయ వంటకాల్లో మసాలా దినసులు ఎంత కీలకమో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, మసాలాలకు కూడా ఎక్స్ పైరీ డేట్ కూడా ఉంటుంది. మనం ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి.. ఇంట్లో డబ్బాల్లో నిల్వ చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సరిగా నిల్వ చేయకపోతే.. మసాలాలు తమ రుచిని, సువాసన కోల్పోతాయి. అందుకే, వీటిని కూడా ఎక్కువ క్వాంటిటీలో కొనుగోలు చేయకూడదు.