Snakes: స‌మ్మ‌ర్‌లో ఇళ్ల‌లోకి పాములు ఎందుకొస్తాయి.? రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా

Published : Mar 08, 2026, 02:36 PM IST

Snakes: వేసవి వేడి పెరిగే కొద్దీ పాములు తమ బొరియలు వదిలి చల్లటి ప్రదేశాల కోసం తిరుగుతుంటాయి. ఈ సమయంలో ఇళ్ల‌లోకి కూడా పాములు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అయితే పాముల‌ను త‌రిమికొట్టేందుకు కొన్ని స‌హ‌జ చిట్కాలు కూడా ఉన్నాయ‌ని మీకు తెలుసా.? 

PREV
15
వేస‌విలోనే ఎందుకు

వేసవి కాలంలో నేల ఉష్ణోగ్రత పెరగడం వల్ల పాములు చల్లని ప్రదేశాల కోసం బయటకు వస్తాయి. ఇంటి చుట్టూ నీడ ఉండటం, చెత్త పేరుకుపోవడం, ఎలుకలు ఉండటం వంటి కారణాల వల్ల అవి అక్కడే తిరుగుతుంటాయి. పాములు సాధారణంగా మనుషులను దాడి చేయవు. కానీ వాటికి ఏమాత్రం అపాయం అనిపించినా వెంట‌నే కాటేస్తాయి. అందుకే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

25
సర్పగంధ

సర్పగంధ మొక్కను పాములను దూరంగా ఉంచే మొక్కలలో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ మొక్క వేర్లు, ఆకులు ఘాటైన వాసనను విడుదల చేస్తాయి. ఆ వాసన పాములకు ఇబ్బందిగా ఉండటంతో అవి ఆ ప్రాంతం దగ్గరకు రావడానికి ఇష్టపడవు. సర్పగంధ మొక్కను ఇంటి గేటు దగ్గర, కిటికీలు దగ్గర లేదా తోటలో నాటితే మంచి ఫలితం ఉంటుంది. చిన్న కుండీల్లో కూడా ఈ మొక్కను పెంచుకోవచ్చు.

35
నిమ్మగడ్డి – సహజ రక్షణ కంచె

నిమ్మగడ్డి నుంచి వచ్చే సిట్రస్ వాసన మనుషులకు సుగంధంగా అనిపించినా పాములకు మాత్రం అసహనంగా ఉంటుంది. అందుకే ఇంటి చుట్టూ వరుసగా నిమ్మగడ్డి మొక్కలు పెంచితే అవి సహజమైన రక్షణ కంచెలా పనిచేస్తాయి. ఈ మొక్క పెంచడం చాలా సులభం. నీరు తక్కువ ఉన్నా పెరుగుతుంది. తోట ఉన్నవారు తప్పకుండా నిమ్మగడ్డి నాటితే ప్రయోజనం ఉంటుంది.

45
తులసి, బంతి పువ్వులు కూడా..

మన ఇళ్లలో సాధారణంగా ఉండే తులసి మొక్క కూడా పాములను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. తులసి నుంచి వచ్చే ప్రత్యేకమైన వాసన కీటకాలతో పాటు పాములను కూడా దగ్గరకు రానివ్వదు.

ఇక‌ బంతి పువ్వుల మొక్కలు కూడా ఇదే విధంగా పనిచేస్తాయి. బంతి మొక్క వేర్లు, ఆకుల వాసన సరీసృపాలకు ఇష్టం ఉండదు. కాబట్టి తోటలో బంతి పువ్వులు పెంచితే కొంతమేర రక్షణ ఉంటుంది.

55
మొక్కలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మొక్కలు పెంచడం ఒక్కటే సరిపోదు. ఇంటి చుట్టూ శుభ్రత కూడా అవసరం. చెత్త పేరుకుపోకుండా చూడాలి, పొదలు ఎక్కువగా పెరగనివ్వకూడదు, గోడల దగ్గర రంధ్రాలు ఉంటే మూయాలి, ఎలుకలు ఉండకుండా జాగ్రత్త పడాలి. రాత్రి సమయంలో బయటకు వెళ్లేటప్పుడు లైట్ వాడాలి. ఇలాంటి సహజ పద్ధతులు పాటిస్తే వేసవి కాలంలో పాముల భయం గణనీయంగా తగ్గుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories