Kids Health: పిల్లల ఆరోగ్యం అనేది తల్లిదండ్రులకు చాలా ఇంపార్టెంట్. అది కూడా వాళ్లు ఎదిగే సమయంలో వారికి ఇచ్చే ఆహారం మరీ ముఖ్యం. అది వారి శరీరానికి మాత్రమే కాకుండా బ్రెయిన్ డెవలప్‍మెంట్‍పై ప్రభావం చూపుతుంది.
తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో అనారోగ్యానికి గురవుతున్న పిల్లలు
ఇప్పుడున్న సమయంలో పిల్లలకు పెట్టే ఫుడ్ విషయంలో తల్లిదండ్రులు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ముఖ్యంగా పెరేంట్స్ ఇద్దరూ ఉద్యోగాల్లో హడావిడిగా ఉండటం, బిజీబిజీగా ఉండటం వల్ల....పిల్లలు ఏం తింటున్నారో, టైంకు తింటున్నారో లేదో చూసుకోరు, పట్టించుకోరు. మరికొంతమంది తల్లిదండ్రులు ఏదో ఒకటి పెట్టేస్తుంటారు. రాత్రి మిగిలిపోయిన బిర్యానీలు, త్వరగా అయిపోయే ఇన్‍స్టంట్ మ్యాగీలు, న్యూడుల్స్ ఇచ్చేస్తుంటారు. దానిపిల్లల్లో జీర్ణప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి బయటఫుడు, మసాలాలు, ప్రిజర్వేటివ్స్ తీసుకుంటే అరగదు. వల్ల వాళ్ల ఆరోగ్యం త్వరగా పాడవుతుంది.
28
పిల్లలకు హెల్ధీ ఫుడ్స్
పిల్లలైనా, పెద్దలకైనా రకరకాల ఫుడ్ తినాలని ఉంటుంది. ఇంట్లో వెరైటీగా, హెల్దీగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకవేళ అలా జరగకపోతే బయట జంక్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ పదార్థాలకు అలవాటు పడతారు. అవి పిల్లల ఆరోగ్యానికి అసలు మంచివి కావు. అందుకే చిన్న పిల్లలకు ఇవ్వకుండా ఉండాల్సిన కొన్ని ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
ముఖ్యంగా కూల్ డ్రింక్స్. చాలా మంది ఇళ్లల్లో కూల్‍డ్రింక్స్ తెచ్చి పెట్టుకుంటారు. పిల్లలు కూడా వాటికి అలవాటుపడిపోతారు. పొద్దున్నే లేవగానే చాలా మంది పిల్లలు కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. కానీ వీటిలో ఎక్కువగా షుగర్, గ్యాస్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇవి పిల్లల పళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఎక్కువగా తీసుకుంటే దంత సమస్యలు, ఒబెసిటీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే శరీరంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి.
పిల్లలకు ఎక్కువగా ఇష్టమయ్యే స్నాక్స్‌లో చిప్స్ ఒకటి. కానీ చిప్స్‌లో ఎక్కువ మోతాదులో సాల్ట్, ఆయిల్, ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెంచుతాయి. దీని వల్ల బీపీ సమస్యలు రావచ్చు. అలాగే జీర్ణక్రియను దెబ్బతీస్తుంది.
58
కాలేయంపై ప్రతికూల ప్రభావం
ఇన్‌స్టంట్ ఫుడ్స్, ఇన్‍స్టంట్ నూడుల్స్...ఇవి 5, 10 నిమిషాల్లో తయారైపోతాయి కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు ఇస్తుంటారు. కానీ వీటిలో ఉండే ప్రిజర్వేటివ్స్, సోడియం, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల పిల్లల్లో ఒబెసిటీ సమస్య పెరుగుతుంది. అలాగే కాలేయంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
68
చాక్లెట్స్, కేకులు తింటే దంతాల సమస్యలు
చాక్లెట్స్, క్యాండీస్‌లో అధికంగా షుగర్, కృత్రిమ రంగులు ఉంటాయి. ఇవి ఎక్కువగా తింటే దంతాల్లో గుల్లలు, దంతాలు పుచ్చిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లల్లో హైపర్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది.
78
పిజ్జా, బర్గర్‍తో ఒబెసిటీ, లివర్ సమస్యలు
జంక్ ఫుడ్స్ అయిన పిజ్జా, బర్గర్ వంటి వాటిలో ఎక్కువగా సాల్ట్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిలో మైదా, శరీరానికి హాని చేసే కెచప్స్, సాస్‍లు ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషకాలు ఇవ్వవు. ఎక్కువగా తింటే ఒబెసిటీ, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
88
ఇంటి భోజనంతో ఆరోగ్యంగా, యాక్టివ్‍గా ఉంటారు
పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే ఇంట్లో తయారుచేసిన భోజనం పెట్టడం చాలా మంచిది. ఫ్రూట్స్, కూరగాయలు, పాలు, గుడ్లు, పప్పులు, గింజలు వంటి పోషకాహారాలు పిల్లల ఆహారంలో ముఖ్యంగా ఉండాలి. దానివల్ల పిల్లల ఆరోగ్యం, మెదడు చురుకుదనం పెరుగుతుంది. గట్ హెల్త్ బాగుంటుంది. యాక్టివ్‍గా ఉంటారు.