చాలామంది వారం రోజుల్లో అయిదు రోజులు బాగా పనిచేసి తక్కువ నిద్రపోతారు. వల్ల వారంలో 5-6 రోజులు సరిగా నిద్రపోరు. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి వారంలో వచ్చే సెలవు రోజున ఎక్కువసేపు నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు… సరికదా ప్రమాదమే ఎక్కువ. ఇది గ్లూకోజ్ మెటబాలిజంపై చెడు ప్రభావం చూపి, ఆరోగ్యాన్ని మరింత పాడుచేస్తుంది.
టైప్ 2 డయాబెటిస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవాలంటే కచ్చితంగా మీరు 7 గంటల 18 నిమిషాలు నిద్రపోయి తీరాలి. మంచం మీద పడుకుని ఇటూ అటూ దొర్లితే సరిపోదు, గాఢ నిద్రపోవాలి. శరీరం ఇన్సులిన్‌ను సరిగా వాడకపోయినా, ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోయినా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల డయాబెటిస్ పెరిగిపోతుంది.