Sleeping Habits: రాత్రి పడుకునే ముందు ముఖానికి దుప్పటి కప్పుకుంటారా?

Published : Dec 06, 2025, 03:21 PM IST

Sleeping Habits: మనలో చాలా మందికి రాత్రి పడుకొనేటప్పుడు బెడ్ షీట్ కప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ముఖానికి కూడా కప్పేసుకుంటారు. కానీ, ఈ అలవాటు చాలా ప్రమాదకరం అని మీకు తెలుసా? 

PREV
13
Sleep

చలికాలంలో దాదాపు అందరూ దుప్పటి లేకుండా పడుకోలేరు. ఆ చలి తట్టుకోవాలంటే కచ్చితంగా దుప్పటి కావాల్సిందే. దుప్పటి కప్పుకున్నప్పుడు శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. హ్యాపీగా నిద్రకూడా పడుతుంది. కానీ, చాలా మంది ముఖానికి కూడా కప్పుకుంటారు. కానీ.. అలా ముఖానికి దుప్పటి కప్పుకోవడం మంచిదేనా? లేక ఆరోగ్యానికి ప్రమాదమా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం....

ముఖానికి దుప్పటి కప్పుకోకపోతే మాకు అసలు నిద్రే పట్టదు అని చాలా మంది అంటూ ఉంటారు. ఇది చాలా కామన్ గా అనిపించొచ్చు. కానీ, దీని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

23
ఆక్సిజన్ లేకపోవడం... కార్బన్ డయాక్సైడ్ పెరగడం...

మీరు మీ ముఖం, తలను పూర్తిగా దుప్పటితో కప్పి నిద్రపోయినప్పుడు శరీరానికి తగినంత తాజా గాలి లేదా ఆక్సీజన్ లభించదు. మీరు వదిలే కార్బన్ డయాక్సైడ్ దుప్పటి లోపలే ఆగిపోతుంది. ఫలితంగా... అదే కార్బన్ డయాక్సైడ్ అధికంగా పీల్చే అవకాశం ఉంటుంది. దీని వల్ల శరీరంలో ఆక్సీజన్ స్థాయిలను తగ్గిస్తుంది. కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను పెంచుతుంది. దాని కారణంగా ఊపిరి ఆడకపోవడం, నిద్రకు ఆటంకం కలగవచ్చు. చివరకు ఉదయం నిద్ర లేచినప్పుడు చాలా అలసిపోయినట్లుగా అనిపిస్తుంది.

33
శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది...

దుప్పటి లేదా బెడ్ షీట్ ముఖానికి కప్పుకొని నిద్రపోవడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. చలికాలంలో రాత్రిపూట నిద్రపోవడానికి శరీరానికి ఉష్ణోగ్రత అవసరమే. కానీ.. మరీ ఎక్కువ వేడి కారణంగా... చెమటలు పట్టేస్తాయి. నిద్రపోయిన కూడా విశ్రాంతి తీసుకున్న ఫీలింగ్ కలగదు. రెస్ట్ లెస్ గా అనిపిస్తుంది.

నిద్ర నాణ్యత తగ్గుతుంది...

ఇలా ముఖం మొత్తం దుప్పటితో కవర్ చేయడం వల్ల ఆక్సీజన్ స్థాయి తగ్గడం నిద్రకు ఆటంకం కలిగించడంతో పాటు ఊపిరి ఆడని భావన కలుగుతుంది. మన శరీరానికి, మానసిక ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా అవసరం. అందుకే, ఈ పొరపాటు చేయకూడదు. రోజూ ఇదే చేయడం వల్ల ఏకాగ్రత తగ్గిపోతుంది. చిరాకు పెరుగుతుంది. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ పొరపాటు చేయకూడదు. కొందరు అయితే, ఫేస్ కి మాస్క్ పెట్టుకొని పడుకుంటారు. ఆ పొరపాటు కూడా చేయకూడదు.

ఈ అలవాటు ఎలా మార్చుకోవాలి..?

మీకు ముఖానికి దుప్పటి కప్పుకోకపోతే నిద్రపోలేం అనే ఫీలింగ్ మీకు ఉంటే.... ఒక చిన్నా చిట్కా పాటించాలి. పూర్తిగా కప్పుకోకుండా.. కనీసం సగం అయినా కప్పుకోవాలి. ముఖ్యంగా ముక్కుకు ఊపిరాడకుండా కప్పుకోవద్దు. గాలి ఆడేలా దుప్పటి కప్పుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories