జుట్టు రాలడం, చివర్లు చిట్లడం వంటి సాధారణ జుట్టు సమస్యలకు సపోటా చాలా బాగా సహాయపడుతుంది.
గిరజాల జుట్టు
జుట్టు రాలడం తగ్గాలంటే...
జుట్టు రాలడం చికిత్సలో సపోటా గింజల నూనెను సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. కావలసినవి:
సపోటా గింజల నూనె - ఒక కప్పు
నల్ల మిరియాలు - అర టీస్పూన్
సపోటా గింజల పొడి - ఒక టీస్పూన్
తయారీ , ఉపయోగం:
ఒక పాన్ లో, నల్ల మిరియాలు , సపోటా గింజల పొడిని సపోటా గింజల నూనెలో వేసి, మిశ్రమాన్ని అధిక వేడి మీద బాగా వేడి చేయండి. ఈ మిశ్రమం బాగా ఆరిన తర్వాత, జాగ్రత్తగా నూనెను వడకట్టి, చల్లబరిచి, గాజు సీసాలో నిల్వ చేయండి. ఈ నూనెలో ఒక దూదిని ముంచి, తలకు పట్టించి, సున్నితంగా మసాజ్ చేయండి. అరగంట లేదా గంట తర్వాత, షాంపూ వాడకుండా, శనగపిండితో మీ జుట్టును కడగాలి. ఈ నూనెను 15 రోజులకు ఒకసారి వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.