ప్యాకేజ్డ్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి..
ప్యాకేజ్డ్ జ్యూస్, సాఫ్ట్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ టీ, కోల్డ్ డ్రింక్స్ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల బరువు పెరుగుతారు. మీకు దాహం తీరాలంటే కూల్ డ్రింక్స్ తాగడానికి బదులు మంచినీరు ఎక్కువగా తాగాలి. దీనివల్ల ఆకలి కూడా అదుపులో ఉంటుంది.
రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల శరీరంలో కొవ్వు (Fat) పేరుకుపోయే అవకాశం పెరుగుతుంది. డిన్నర్ రాత్రి 7-8 గంటల మధ్యలో చేయడం ఉత్తమం.మీరు జిమ్ కి వెళ్ళకుండా, టెన్షన్ లేకుండా బరువు తగ్గాలనుకుంటే, మీరు మీ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవాలి.
ప్రతి గంటకు 60 సెకన్లు నడవండి
మీరు డెస్క్ జాబ్ చేస్తే, ప్రతి గంటకు 1 నిమిషం నడవండి.ఇది రక్త ప్రవాహాన్ని సరిగ్గా ఉంచుతుంది, శరీరాన్ని నీరసంగా ఉండనివ్వదు.