Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది!

పెళ్లి.. జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలంటే ఒకరి గురించి ఒకరికి చాలా విషయాలు తెలిసి ఉండాలి. ఇద్దరి మనసులు, అభిరుచులు, ఆలోచనలు అన్నీ కలవాలి. చాణక్యుడి నీతి ప్రకారం పెళ్లి చేసుకునే అమ్మాయిలో అందం మాత్రమే కాదు చాలా విషయాలు గమనించాలట. కొన్ని లక్షణాలు ఉన్న అమ్మాయిలను అస్సలు పెళ్లి చేసుకోకూడదట. మరి ఎలాంటి అమ్మాయిలకు దూరంగా ఉండాలో ఇక్కడ చూద్దాం.

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి. సంతోషం, తోడు కోసం పెళ్లి చేసుకుంటారు. పెళ్లి ప్రతి ఒక్కరికీ అవసరం కూడా. చాలామంది పెళ్లి చేసుకునే వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే పెళ్లికి సిద్ధం అవుతారు. అది ఎంతమాత్రం మంచిది కాదంటున్నాడు ఆచార్య చాణక్యుడు. పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలని తన బోధనల్లో పేర్కొన్నాడు. చాణక్య నీతి ప్రకారం ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్

చాణక్య నీతి ప్రకారం పెళ్లి చేసుకునే అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మంచిగా ఉండాలి. మంచి ఫ్యామిలీ నుంచి రాని అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని చాణక్య నీతి చెబుతోంది. ఆమె అందంగా ఉన్నా సరే పెళ్లి  చేసుకోకపోవడమే మంచిదట.


అమర్యాదగా ప్రవర్తించే అమ్మాయి

పెళ్లి ఇద్దరు వ్యక్తులే కాదు. రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. కాబట్టి ఒక అమ్మాయి అమర్యాదగా, అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆమెను పెళ్లి చేసుకోకూడదని చాణక్య నీతి చెబుతోంది.

చెడు స్వభావం

అమ్మాయికి అందం మాత్రమే ముఖ్యం కాదు. ఒక అందమైన అమ్మాయికి చెడు స్వభావం ఉంటే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని చాణక్య నీతి చెబుతోంది.

అబద్ధాలు చెప్పే అమ్మాయి

అబద్ధాలు చెప్పే అమ్మాయిలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చాణక్య నీతి చెబుతోంది. ఆ అబద్దాలను తన భర్తకు వ్యతిరేకంగా ఉపయోగించి.. చివరికి కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుందని చాణక్యుడు తన బోధనల్లో వివరించాడు.

నమ్మకద్రోహం

తన ఫ్యామిలీ మెంబెర్స్‌తో నమ్మకద్రోహం చేసే అమ్మాయిని కూడా నమ్మకూడదు. ఆమె తన భర్తతో కూడా నమ్మకద్రోహం చేయవచ్చని చాణక్యుడు చెప్పాడు.

ఇంటి పని

ఇంటి పని గురించి ఎక్కువ తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని చాణక్యుడు చెప్పాడు. భక్తి లేని అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవడం అంత మంచిదికాదని చాణక్యుడు తన నీతి సూత్రాల్లో బోధించాడు.

Latest Videos

click me!