Summer: ఎండాకాలంలో చెమట దుర్వాసన పోగొట్టాలా? ఈ టీ తాగితే చాలు

ఎండాకాలంలో చెమటలు పట్టడం చాలా సర్వసాధారణం. ఆ చెమటలకు మన శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ వాసనకు మన పక్కన ఎవరైనా కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి, ఏం చేస్తే.. ఈ దుర్వాసన రాకుండా చేయచ్చో తెలుసుకుందామా..

The Best Tricks to Reduce Under Arm Odor in Summer


ఎండాకాలం వచ్చింది అంటే చాలు ఫ్యాన్ కింద కూర్చొన్నా కూడా చెమటలు కారిపోతూ ఉంటాయి. ఈ చెమటలు రావడం ఒక ఇబ్బంది అంటే..ఆ చెమట కారణంగా ఒంటి దుర్వాసన చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది.ఆ దుర్వాసన పక్కన వారికి మాత్రమేకాదు.. మనకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ వాసన రాకుండా ఉండేందుకు డియోడరెంట్లను చాలా మంది వాడుతూ ఉంటారు. కానీ,వాటి వల్ల దుర్వాసన కొంత వరకు మాత్రమే ఆపగలం. కాసేపటికి మళ్లీ దుర్వాసన రావడం మొదలౌతుంది. పైగా డియోడరెంట్లను వాడటం వల్ల శరీర భాగాలు నల్లగా కూడా మారిపోతాయి. మరి, ఈ సమస్యకు పరిష్కారమే లేదా అంటే కచ్చితంగా ఉంది. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. ఈ చెమట సమస్య నుంచి బయటపడొచ్చు.

Body odor

వేప ఆకులతో స్నానం..
వేప ఆకులు మనకు సులభంగానే లభిస్తాయి. ఇవి చర్మ వ్యాధుల చికిత్సకు బాగా సహాయపడతాయి. ముఖంపై మొటిమలు రాకుండా కాపాడటమే కాదు..మన చర్మ దర్వాసన రాకుండా కూడా కాపాడుతుంది. ఎందుకంటే.. వేప ఆకుల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. దీని కోసం రాత్రి వేప ఆకులను నీటిలో వేసి రాత్రంతా అలానే ఉంచాలి. ఉదయం లేచిన తర్వాత ఈ నీటిని స్నానం చేసే నీటిలో వేసుకొని  స్నానం చేస్తే చాలు. ఇలా చేయడం వల్ల దుర్వాసన తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి


చందనం కూడా వాడొచ్చు..

చమట దుర్వాసనను తొలగించడానికి, గంధం , రోజ్ వాటర్‌లను కలిపి రాస్తే చాలు. ఈరెండూ కలిపి పేస్టులాగా మార్చి.. చెమట వచ్చే ప్రదేశాల్లో రాసుకుంటే చాలు. 2 టీస్పూన్ల గంధపు పొడిని రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్‌గా తయారు చేసుకోండి. స్నానానికి కొన్ని నిమిషాల ముందు శరీరానికి అప్లై చేసి, స్నానం చేసేటప్పుడు కడిగేయండి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా పెరగకుండా కాపాడుతుంది. ఇలా చేయడం వల్ల కూడా దుర్వాసన రాకుండా ఉంటుంది.
 

లైకోరైస్ టీ తాగండి..

మార్కెట్లో మనకు లైకోరైస్ టీ లభిస్తుంది. దానిని కనుక మీరు రెగ్యులర్ గా తాగడం అలవాటు చేసుకుంటే చాలు. ఇలా చేయడం వల్ల నోటి నుంచే కాదు.. శరీరం నుంచి కూడా దుర్వాసన రాదు. చెమట కారణంగా పెరిగే బ్యాక్టీరీియాను తొలగించడంలో సహాయపడే యాంటీ బాక్టీరియా లక్షణాలు కూడా ఈ టీలో ఉంటాయి. 
 

Latest Videos

click me!