ఆఫీసులో గంటలు, గంటలు కష్టపడి రాత్రిళ్లు ఆలస్యంగా ఇంటికి వెళ్లే ఉద్యోగులు తమ లైఫ్ పార్ట్నర్ తో శృంగారంలో పాల్గొనడం కంటే నిద్రపోవడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలింది.
undefined
దానికి కారణాలు ఎలా ఉన్నా.. తమ భాగస్వామి కోసం ఎదురుచూసే వారు మాత్రం బాధపడుతున్నారట. వందలో ఎనబై శాతం మంది ఉద్యోగులు సెక్స్, నిద్ర ఆప్షన్లు ఇస్తే.. నిద్రపోవడానికే ఓటేస్తున్నట్లు తెలిసింది. అలసిపోయి ఇంటికి వచ్చే ఉద్యోగులు కంటినిండా నిద్రపోవాలని అనుకుంటున్నారు.
undefined
అలా లేకపోతే మరుసటి రోజు పనుల్లో ఏకాగ్రత ఉండదని, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. అయితే వైద్య నిపుణులు మాత్రం సెక్స్ తో పాటు నిద్రకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని అంటున్నారు.
undefined
పార్ట్నర్ తో శృంగారంలో పాల్గొనడం వలన హ్యాపీ హార్మోన్లు విడుదలై నిద్ర బాగా పడుతుందని, స్లీప్ థెరపీలో భాగంగా సెక్స్ చేయడం కూడా ముఖ్యమేనని చెబుతున్నారు. శృంగారంలో పాల్గొనడం వలన శరీరంలో విష పదార్ధాలు తొలగిపోతాయని, రోగనిరోధకశక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
undefined
ఇక రాత్రి కుదరకపోతే... శృంగార కోరికలు చంపుకొని రోజంతా మూడీగా ఉండాల్సిన అవసరం లేదని కూడా వారే చెబుతున్నారు. రాత్రి వేళ నిద్ర బాగా డామినేట్ చేస్తే... శృంగారానికి ఉదయాన్ని స్పేస్ ఇవ్వాలని సూచిస్తున్నారు.
undefined
చాలా మంది శృంగారాన్నిచీకటి వ్యవహారంగా చూస్తారు. అందుకే రాత్రి పూట మాత్రమే చేయాల్సిన పనిగా భావిస్తారు. అయితే... ఆలుమగలకు మూడ్ ఉండాలే గానీ.. సమయంతో ఎలాంటి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు.
undefined
తాజాగా ఓ సంస్థచేసిన పరిశోధనలో ... రాత్రి వేళ కన్నా కూడా.. తెల్లవారుజామున సెక్స్ ఎంజాయ్ చేస్తేనే మంచిదని తేలిందట. తెల్లవారుజామున శృంగారంలో పాల్గొంటే... హార్మోన్ల బ్యాల్సెన్స్ సరిగ్గా ఉంటుందని తేలింది. అంతేకాదు... బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుందట.
undefined
ఇది కనుక వర్కౌట్ అయితే... మళ్లీ ప్రత్యేకంగా వర్కౌట్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదని చెబుతున్నారు. అదేవిధంగా రోగనిరోధక శక్తిగా పెరుగుతుందని సూచిస్తున్నారు.
undefined