Grey Hair: చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేసిందని ఫీలౌతున్నారా? అయితే.. తెల్ల జుట్టు సమస్యను తగ్గించి, మళ్లీ మీ జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. చిన్న సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు..ఉసి
ప్రస్తుత కాలంలో తెల్ల జుట్టు అనేది వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య. తెల్ల వెంట్రుకలు రావడం మొదలుపెట్టగానే.. ఎవరిలో అయినా కాస్త కంగారు మొదలౌతుంది. వాటిని ఎలా కవర్ చేయాలా అని ప్రయత్నిస్తూ ఉంటారు. దాని కోసం మార్కెట్లో దొరికే అన్ని కలర్స్ జుట్టుకు పూయడం మొదలుపెడతారు. కానీ.. వాటితో సంబంధం లేకుండానే మీ జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...
తెల్ల జుట్టుకు చెక్ పెట్టడానికి మనకు ఉన్న అద్భుతమైన పరిష్కారం ఉసిరి. మనకు సహజ సిద్ధంగా లభించే ఉసిరిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టులోని మెలనిన్ శాతాన్ని కాపాడి, జట్టు తొందరగా తెల్లపడకుండా చేస్తాయి. వచ్చిన తెల్ల వెంట్రుకలను కూడా నల్లగా మార్చడంలో సహాయపడతాయి.
23
ఉసిరి, కొబ్బరి నూనె (Amla Coconut Oil)
ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రభావవంతమైన పద్ధతి.ఈ రెండూ కలిపిన నూనె రాయడం వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. దీని కోసం..ఒక కప్పు కొబ్బరి నూనెలో 2 చెంచాల ఎండిన ఉసిరి ముక్కలు లేదా ఉసిరి పొడి వేసి బాగా మరిగించాలి. నూనె నల్లగా మారే వరకు వేడి చేయాలి.
ఈ నూనె చల్లారిన తర్వాత వడకట్టి, వారానికి రెండుసార్లు తలకు పట్టించి బాగా మర్దన చేయాలి. ఇది జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చి, సహజ రంగును కాపాడుతుంది.
2. ఉసిరి, మందార ఆకుల మాస్క్ (Amla, Hibiscus Pack)తయారీ: పచ్చి ఉసిరికాయల పేస్ట్ , కొన్ని మందార ఆకులను కలిపి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాల పాటు ఉంచాలి. ఆపై కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. మందార జుట్టుకు కండిషనర్‌లా పనిచేస్తే, ఉసిరి రంగును మెరుగుపరుస్తుంది.
33
ఉసిరి రసం, నిమ్మరసం (Amla , Lemon Juice)తయారీ:
ఒక చెంచా ఉసిరి రసంలో ఒక చెంచా నిమ్మరసం కలపాలి.రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి, మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇది చుండ్రును తగ్గించడమే కాకుండా జుట్టు అకాల నెరుపును (Premature Greying) అరికడుతుంది.
4. ఉసిరిని ఆహారంగా తీసుకోవడం (Internal Consumption)జుట్టుకు పైన పూయడమే కాకుండా, లోపలికి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజూ ఉదయం పరగడుపున గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం ఉసిరి రసం, తేనె కలిపి తాగాలి.దీనిని తాగడం వల్ల... ఇది రక్తాన్ని శుద్ధి చేసి, జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఉసిరి చిట్కాలు వాడుతున్నప్పుడు కెమికల్ షాంపూలకు దూరంగా ఉండండి. కుంకుడుకాయలు లేదా శీకాకాయ వాడటం ఉత్తమం. అంతేకాదు.. ఇవి సహజ సిద్ధమైన చిట్కాలు కాబట్టి, ఫలితం కనిపించడానికి కనీసం 2-3 నెలల సమయం పడుతుంది.