Ramadan Charity ఇది కదా రంజాన్ పుణ్యం అంటే.. పిల్లల కోసం రూ.లక్షలు వెచ్చించిన టీచర్లు!

రంజాన్ మాసంలో పేదలకు సాయం చేయాలని ఆ అల్లాహ్ చెబుతారు. అలా చేస్తే పుణ్యం వస్తుందంటారు. మిగతా వాళ్ల సంగతి ఏమోగానీ చిక్కమగళూరు ప్రభుత్వ స్కూల్ టీచర్లు రంజాన్ పండుగలో సొంతంగా 2.5 లక్షలు ఖర్చు చేసి బోరు వేయించి పిల్లల దాహం తీర్చారు. మూడేళ్లుగా నీళ్ల కోసం ఎదురు చూస్తున్న పిల్లలకు టీచర్ల చొరవతో మేలు జరిగింది. వాళ్లు పండగ సందర్భంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు.

చిక్కమగళూరు తాలూకా మాచగొండన హళ్లి ప్రభుత్వ స్కూల్లో పెద్ద ఆటస్థలం ఉంది. కావాల్సినంత మంది టీచర్లు ఉన్నారు. 250 మందికి పైగా పిల్లలు చదువుకుంటున్నారు. పవిత్రమైన రంజాన్ పండుగలో దానం, ధర్మం చేయడానికి బదులుగా మూడేళ్లుగా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలకు సాయం చేయాలని అనుకున్నారు. ఈ సమస్య గురించి పెద్ద ఆఫీసర్లకు చెబితే పట్టించుకోలేదు. పంచాయితీకి చెబితే 3 రోజులకోసారి నీళ్లు ఇచ్చేవాళ్లు. అందుకే ఈ స్కూల్ టీచర్లు హీనా తబ్సుమ్, రజియా సుల్తాన్ ఇద్దరూ కలిసి ఈ గొప్ప పని చేయాలనుకున్నారు.

రెండు బోర్లు ఫెయిల్.. మూడో ప్రయత్నంలో నీళ్లు : స్కూల్ ఆవరణలో 150 అడుగులు, 80 అడుగులు తవ్వినా పెద్ద బండరాళ్లు అడ్డు రావడంతో రెండు బోర్లు ఫెయిల్ అయ్యాయి. మూడో ప్రయత్నం సక్సెస్ కావడంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. ఈ ఇద్దరు టీచర్లు ముస్లిం మతానికి చెందిన వాళ్లు. రంజాన్ పండుగలో కష్టాల్లో ఉన్నవాళ్లకు సాయం చేయాలని ఈ రంజాన్‍కు పిల్లలకు 2.5 లక్షలు ఖర్చు చేసి బోరు వేయించారు.

Latest Videos

click me!