1. ముందుగా ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి బాగా మరిగించండి. ఆ వేడి నీళ్లలో ఒట్టి తునకలను వేసి కాసేపు నాననివ్వండి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి బాణలిలో నూనె వేసి వేడి చేయండి.
3. నూనె కాగాక లవంగాలు, దాల్చిన చెక్క వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించండి.
4. ఉల్లిపాయలు వేగాక అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి.
5. ఇప్పుడు టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేలా మగ్గనివ్వండి.
6. టమోటాలు మగ్గిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపండి.
7. ఇప్పుడు వేడి నీళ్లలో నానిన తునకలను తీసి ఈ మసాలాలో వేసి 2 నిమిషాలు కలపండి.
8. తర్వాత ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి, మూత పెట్టి సన్నని మంటపై ఉడికించండి.
9. కూర బాగా దగ్గరపడి నూనె పైకి తేలుతున్నప్పుడు గరం మసాలా పొడి చల్లండి.
10. స్టవ్ కట్టేసే ముందు కొత్తిమీర తరుగు చల్లి దింపేయండి. అంతే టేస్టీ ఒట్టి తునకల కూర రెడీ అయినట్టే.