నీట్ ( Neat)..
ఏదీ కలపకుండా.. డైరెక్ట్ గా విస్కీ తాగడాన్ని నీట్ అంటారు. ఇది విస్కీ ఒరిజినల్ టేస్ట్ తెలియజేస్తుంది. కొద్దిగా విస్కీని పోసి గ్లాసును కొద్దిసేపు పక్కన ఉంచాలి. దానిని తాగేటప్పుడు ముక్కుకు మరీ దగ్గరగా ఉంచి పూర్తిగా వాసన పీల్చకుండా.. కొంచెం దూరం నుంచి మెల్లగా వాసన పీల్చాలి. మొదటిసారి చిన్న సిప్ తీసుకొని నాలుక దానికి అలవాటు పడేలా చేయాలి. ఇలా చేయడం వల్ల విస్కీ రుచి బాగా తెలుస్తుంది.
విస్కీలో నీరు కలిపితే....
విస్కీలో కొద్దిగా నీరు కలపడాన్ని "ఓపెన్ అప్ చేయడం" అంటారు. విస్కీలో నీరు, ఇథనాల్ అనేక సువాసన సమ్మేళనాలు ఉంటాయి. కొద్దిగా నీరు కలిపితే విస్కీ రుచి ఏమీ మారదు. కానీ, నీటి మోతాదు ఎక్కువైతే విస్కీ తేలికగా మారుతుంది. గ్లాసులో సగం వరకు నీరు ఉంటే దాని బాడీ, ఫ్లేవర్ తగ్గిపోతాయి. ఒకవేళ ముప్పావు వంతు నీరు కలిపితే ఆ విస్కీ ఒరిజినల్ రుచిని అంచనా వేయడం కష్టమవుతుంది.
ఐస్ (On The Rocks)…
ఐస్ క్యూబ్స్ కలపడం వల్ల విస్కీ ఉష్ణోగ్రత, డైల్యూషన్ రెండూ మారుతాయి. చల్లదనం వల్ల సువాసనలు విడుదలయ్యే వేగం తగ్గి విస్కీ సువాసన మృదువుగా మారుతుంది, అలాగే ఆల్కహాల్ ఘాటు కూడా తగ్గుతుంది. ఐస్ కరుగుతున్న కొద్దీ విస్కీ రుచి మారుతూ వస్తుంది. ఇది తాగడానికి చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది.