Beauty Tips: దృఢమైన మెరిసే జుట్టు కోసం.. ఆనియన్ ని ఈ విధంగా ఉపయోగించండి!

Navya G | Published : Oct 6, 2023 10:28 AM
Google News Follow Us

Beauty Tips: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి జుట్టు రాలడం అనేది ఒక పెద్ద సమస్యగా తయారయింది అయితే ఉల్లిపాయ ఈ సమస్యకి చక్కని పరిష్కారం అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అదెలాగో చూద్దాం.
 

16
Beauty Tips: దృఢమైన మెరిసే జుట్టు కోసం.. ఆనియన్ ని ఈ విధంగా ఉపయోగించండి!

 జుత్తు రాలిపోవడం, జుట్టు నిర్జీవంగా మారటం వంటి అనేక సమస్యలకి ఉల్లిపాయ మంచి పరిష్కారం. ఉల్లిపాయలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుకలిగి ఉంటాయి. ఇవి జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను నయం చేస్తాయి. ఇందులో మళ్లీ ఉల్లినూనె కన్నా ఉల్లి రసం మరింత మెరుగైన ఫలితాలను అందిస్తుందని నిపుణులు చెప్తున్నారు.
 

26

దీనికోసం మీరు ఉల్లిపాయను మెత్తని గుజ్జుగా చేసి చిన్న కాటన్ వస్త్రంలో వేసి రసాన్ని వడకట్టండి. ఆ తర్వాత రసాన్ని చిన్న కాటన్ ప్యాడ్ ఉపయోగించి మీ తల పై రాయండి. ఆపై స్కాల్ఫ్ కి మసాజ్ చేసి ఒక గంట పాటు అలాగే ఉంచి ఆపై షాంపూ తో శుభ్రం చేసుకోండి.
 

36

ఉల్లి రసాన్ని అప్లై చేసే సమయంలో దానికి మరి ఇతర నూనెలని జోడించకండి. కేవలం ఉల్లి రసం మాత్రమే మంచి ఫలితాలను అందిస్తుంది. ఇలా వారానికి  ఒకసారి ఎనిమిది వారాలపాటు క్రమం తప్పకుండా వర్తిస్తే మీ తలలో రక్తప్రసరణ పెరుగుతుంది.
 

Related Articles

46

మీ జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. వెంట్రుకల కుదురులకు పోషకాలు అందించడంతోపాటు  జుట్టు పొడవుగా  పెరిగేలా చేస్తుంది.అంతేకాకుండా  మీ జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ జుట్టు చిట్లిపోకుండా అలాగే జుట్టు  పల్చబడటాన్ని నిరోధిస్తుంది.

56

హెయిర్ పోలికల్స్  పెరగటానికి సల్ఫర్ అవసరం. ఉల్లిపాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అవి తెల్ల వెంట్రుకలను నివారించడంలో సహాయపడతాయి. ఉల్లిపాయ మీ జుట్టుకి పోషణ అందించి జుట్టు రాలటాన్ని నిరోధించడంలో అలాగే ఆరోగ్యవంతమైన జుట్టుని అందించడంలో సహాయపడుతుంది.
 

66

ఉల్లి లోని గొప్ప గుణాలు తెలిసిన చాలా కంపెనీలు తమ హెయిర్ ప్రొడక్ట్స్ లో  ఉల్లిని  భాగంగా చేస్తున్నాయి. అయితే అలా బయట దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ కన్నా ఇంట్లోనే ఉల్లిపాయని ఈ విధంగా వాడుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయి.

Recommended Photos