2023 సంవత్సరానికి గుడ్ బాయ్ చెప్పేసే సమయం వచ్చింది. త్వరలో కొత్త సంవత్సరానికి వెల్ కం చెప్పబోతున్నాం. ఈ సందర్భంగా భారతదేశం అంతటా కొత్త సంవత్సరాన్ని ఎన్నో రకాలుగా జరుపుకుంటారు. మీరు కూడా మీ ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. దీని వల్ల మీకు న్యూ ఇయర్ రోజున పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతారు కూడా. మరి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్పెషల్ గా ఉండాలంటే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ న్యూ ఇయర్ స్పెషల్ గా ఉండాలంటే.. కొత్త సంవత్సరం నాడు అన్ని పనులను ముండుగానే చేయడం మంచిది. అంటే సమయం పట్టే కొన్ని పనులను ముందుగానే చేయొచ్చు. ఇలాంటి పనులను మీరు డిసెంబర్ 31 లోగా పూర్తయ్యేలా చూసుకోండి.
ముందుగానే శుభ్రం చేయండి
కొత్త సంవత్సరానికి ముందే మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇంటిని జనవరి 1వ తేదీనే శుభ్రం చేయాలని వెయిట్ చేయకండి. ఇంటిని క్లీన్ చేయడానికి ఇంట్లో ఉన్న షాంపూ, బేకింగ్ సోడాను మిక్స్ చేసి ద్రవాన్ని తయారు చేయండి. ఈ ద్రవంతో ఇంటి టైల్స్ తో పాటు బాత్రూమ్ ను కూడా శుభ్రం చేసుకోవచ్చు.
ఇంటి డెకరేషన్
న్యూ ఇయర్ కు మీ ఇంటిని అందంగా డెకరేట్ చేయడానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోండి. అంటే శుభ్రం చేసిన తర్వాత ఇంట్లో లైట్లను ఏర్పాటు చేసుకోవాలి. స్పెషల్ లుక్ ఇవ్వడానికి ఫ్లవర్ వాస్క్ ను కూడా పెట్టొచ్చు. అయితే క్లీన్ చేయడానికి ఇబ్బందిగా ఉన్న డెకరేషన్ వస్తువులను ఉపయోగించకపోవడమే మంచిది. ఇవి లుక్ ను పాడుచేస్తాయి.
పిల్లల కోసం ..
ఈ చిట్కాలన్నింటితో పాటుగా మీ పిల్లల కోసం కూడా కాస్త విడిగా సిద్ధం చేయండి. చాలా మంది తల్లిదండ్రులు కేవలం వారి పార్టీ గురించి మాత్రమే పట్టించుకుంటారు. కానీ దీనివల్ల మీ పిల్లలు సంతోషంగా ఉండరు. అందుకే ఈ న్యూ ఇయర్ కు మీ పిల్లలకు నచ్చిన బోర్డ్ గేమ్స్ తీసుకురావడానికి ప్రయత్నించండి.