Birth Control: కండోమ్‌ల‌తో ప‌నేలేదు.. మ‌గ‌వారి కోసం స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ

Published : May 03, 2025, 04:59 PM ISTUpdated : May 03, 2025, 05:00 PM IST

కుటుంబ నియంత్ర‌ణ అన‌గానే ముందుగా గుర్తొచ్చేది మ‌హిళ‌లు ఉప‌యోగించే గ‌ర్భనిరోధ‌క మాత్రలు. అదే పురుషుల విష‌యానికొస్తే కండోమ్స్‌. అయితే కండోమ్స్ కాకుండా మ‌రే ప్ర‌త్యామ్నాయ అవ‌కాశం లేదా.? అంటే క‌చ్చితంగా ఉంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఆ దిశ‌గా కీల‌క అడుగు వేశారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
16
Birth Control: కండోమ్‌ల‌తో ప‌నేలేదు.. మ‌గ‌వారి కోసం స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ
Food for Sperm Count

పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కుటంబ‌ నియంత్రణ (బర్త్ కంట్రోల్) ఇంజెక్షన్ ఒకటి త్వరలో మార్కెట్‌లోకి రానుంది. ADAM పేరుతో అభివృద్ధి చేసిన ఈ కొత్త ఇంజెక్షన్‌ను ఒకసారి తీసుకుంటే, దాదాపు రెండేళ్లపాటు స్పెర్మ్ విడుదల ఆగిపోతుంది. ఈ వ్యాధినిరోధక విధానం పిల్లల పుట్టుదలను నివారించగలదు.
 

26

ఈ నూతన పద్ధతిని అమెరికాలోని బయోటెక్నాలజీ కంపెనీ ‘Contraline’ అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఫేజ్ 1 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఫేజ్ 2 ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు అందరిలోనూ దీనిపై ఆసక్తి పెరుగుతోంది ఇది ఎలా పనిచేస్తుంది? ఎంత వరకు ప్రభావవంతంగా ఉంటుంది? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

36

ADAM ఎలా పనిచేస్తుంది?

ADAM అనేది ఒక హైడ్రోజెల్ ఆధారిత ఇంజెక్షన్. దీనిని టెస్టికల్స్ నుంచి వీర్యాన్ని తీసుకెళ్లే మార్గం లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ హైడ్రోజెల్ ఒక శారీరక అడ్డంకిగా పనిచేస్తుంది. దీని వల్ల స్పెర్మ్‌ కణాలు సీమెన్‌తో కలవకుండా అడ్డుపడతాయి. అయితే స్క‌ల‌నంపై ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌దు. ఎందుకంటే సీమెన్ ఉత్పత్తి కొనసాగుతుంది, కానీ అందులో స్పెర్మ్ ఉండదు. 

46

ఇది ఎంత కాలం పనిచేస్తుంది?

శాస్త్రవేత్తల ప్రకారం, ఈ ఇంజెక్షన్ సుమారు 2 సంవత్సరాలు ప్రభావవంతంగా పనిచేస్తుంది. అనంతరం జెల్ స్వయంగా కరిగిపోయి శరీరం మళ్లీ సాధారణ స్థితికి చేరుతుంది. అయితే మ‌ధ్య‌లోనే జెల్‌ను తిరిగి తొలగించే అవకాశం కూడా అందుబాటులో ఉంది. 

56

ప్రక్రియ ఎలా జరుగుతుంది?

ఈ చికిత్సను సాధారణంగా అనస్థీషియాతో 10–30 నిమిషాల ఔట్‌పేషెంట్ ప్రొసీజర్‌లో చేస్తారు. జెల్‌ను వాస్ డిఫెరెన్స్ లోకి ఇంజెక్ట్ చేస్తారు. అది అక్కడ గట్టిపడి స్పెర్మ్‌ను అడ్డుకునే అడ్డంకిగా పనిచేస్తుంది. ఇది మహిళలకి వాడే IUD (Intrauterine Device) లాంటిదే.

66

ట్రయల్స్‌లో ఫలితాలు ఎలా ఉన్నాయి?

ఫేజ్ 1 ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయి. ప్రయోగంలో పాల్గొన్న వ్యక్తులలో రెండేళ్లపాటు స్పెర్మ్ ఉత్పత్తి కనబడలేదు. ఇంకా, ఇంజెక్షన్ తర్వాత మొదటి 30 రోజుల్లో 99.8%–100% వరకు స్పెర్మ్ విడుదల తగ్గినట్లు గుర్తించారు. జంతువులపై నిర్వహించిన అధ్యయనాల్లో రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ సాధారణ స్పెర్మ్ నాణ్యత కనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

అవ‌స‌ర‌మా.? 

ఇదిలా ఉంటే ఈ ఆవిష్క‌ర‌ణ‌పై ప‌లు కామెంట్స్ వ‌స్తున్నాయి. ఓవైపు జ‌నాభా రేటు త‌గ్గిపోతుంటే ఇలాంటి టెక్నాల‌జీలు అవ‌సర‌మా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ఈ ఆవిష్క‌ర‌ణ బాగుంద‌ని అభియప్రాయ‌ప‌డుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories