కిచెన్ క్లీన్ చేస్తున్నారా? అయితే ఇవి తెలియాల్సిందే...

First Published Jan 10, 2021, 10:40 AM IST

ఇల్లు, ఒళ్లు శుభ్రంగా ఉంచుకోవడం ఈ యేడు అందరి టాస్క్ గా మారిపోయింది. గడిచిన కాలం నేర్పిన పాఠాలు ఇప్పుడు అందరిలోనూ శుభ్రత మీద స్పృహ పెరిగింది. అయితే ఈ క్లీనింగ్ లో కొన్ని టిప్స్ తెలుసుకుంటే రోజువారీ లైఫ్ స్టైల్ హాయిగా గడిచిపోతుంది. 

ఇల్లు, ఒళ్లు శుభ్రంగా ఉంచుకోవడం ఈ యేడు అందరి టాస్క్ గా మారిపోయింది. గడిచిన కాలం నేర్పిన పాఠాలు ఇప్పుడు అందరిలోనూ శుభ్రత మీద స్పృహ పెరిగింది. అయితే ఈ క్లీనింగ్ లో కొన్ని టిప్స్ తెలుసుకుంటే రోజువారీ లైఫ్ స్టైల్ హాయిగా గడిచిపోతుంది.
undefined
ముఖ్యంగా వంటిళ్లు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం హాయిగా ఉంటుంది. బైటినుండి వచ్చే ఆహారపదార్ధాలు ముందుగా చేరేది వంటింట్లోకే అందుకే వంటిళ్లు.. దాని అనుబంధం అంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
undefined
వంటిల్లు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది స్టౌ, సింక్.. వీటితో పాటు కప్ బోర్డ్స్ వంటింట్లో వాడే కట్టర్లు, వెచ్చాలు పోసుకునే డబ్బాలు, కూరగాయలు, పండ్లు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దగానే ఉంటుంది.
undefined
నేటి రోజుల్లో చేతులు సబ్బుతో కడుక్కోవడం, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వేసుకోవడం వంటివి న్యూ నార్మల్ అయిపోయాయి. అయినా కూడా ఇన్‌ఫెక్షన్ సోకుతుందేమోనన్న భయం వెంటాడుతూనే ఉంది.
undefined
అందుకే, ఫుడ్ సేఫ్టీ ఇప్పుడు మన ప్రయారిటీగా మారిపోయింది. దాని కోసం ఎన్నో మెజర్స్ తీసుకుంటున్నాం. అందులో ఒకటే వంటింటి క్లీనింగ్. ఇంటిని క్లీన్ చేసుకుంటున్నప్పుడు కిచెన్‌ని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుంటే ఇంకాస్త జాగ్రత్తగా ఉండొచ్చు.
undefined
గ్యాస్ స్టవ్ ని రెగ్యులర్ గా క్లీన్ చేయకపోతే ఇన్‌ఫెక్షన్స్ కి అది బ్రీడింగ్ గ్రౌండ్ గా మారిపోతుంది. గ్యాస్ స్టవ్ ని రోజుకి రెండు సార్లు క్లీన్ చేయమని నిపుణులు చెబుతున్నారు. సోప్ వాటర్ తో క్లీన్ చేస్తే ఇంకా మంచిది. ఇది చాలా చిన్న విషయమే కానీ, ఫుడ్ సేఫ్టీ కి సంబంధించి ఇదొక ఇంపార్టెంట్ పాయింట్.
undefined
మార్కెట్ నుండి తీసుకొచ్చిన పండ్లూ, కూరగాయలూ కడిగే ముందు కిచెన్ కౌంటర్ మీదే పెడతాం. అందుకే కిచెన్ కౌంటర్స్ నీట్ గా, క్లీన్ గా ఉంటేనే కంటామినేషన్ జరగకుండా ఉంటుంది. పండ్లూ కూరగాయలూ కడగడానికి పెట్టే ముందూ కౌంటర్ క్లీన్ చేయాలి. అవి కడిగిన తరువాత కౌంటర్ మీద పెట్టే ముందు కూడా క్లీన్ చేయాలి. అలాగే చాపింగ్ బోర్డ్ ని కూడా ఎప్పటికప్పుడు ఉప్పూ, నిమ్మ రసం కలిపిన నీటితో క్లీన్ చేయాలి.
undefined
ఇది వరకు పండ్లు, కూరగాయలు మార్కెట్ నుండి తేగానే ప్రిడ్జ్ లో పడేసేవారు. కానీ ఇప్పుడు క్లీన్ చేసి కానీ వాటిని ముట్టడం లేదు. అందుకే మార్కెట్ నుండి తెచ్చిన పండ్లూ కూరగాయలను రన్నింగ్ వాటర్ కింద కడగాలి. చేతితో రుద్దుతూ కడగాలి. దుంపల్ని వెజిటబుల్ బ్రష్ తో క్లీన్ చేస్తే మంచిది.
undefined
ఇక ఒక్కొక్కటిగా కడగలేని వాటిని కొలాండర్ లో వేసి రన్నింగ్ వాటర్ కింద చేత్తో తిప్పుతూ కడగాలి. ఆకు కూరల్ని చల్లని నీటిలో ఉంచాలి. క్యాబేజ్ కి పైన రెండు మూడు ఆకులు తీసేసి పేపర్ టవల్ తో తుడవాలి.
undefined
పప్పులూ, పంచదార, గోధుమ పిండి వంటివి స్టోర్ చేసే కంటెయినర్లు కూడా ఇంపార్టెంటే. ఒక్కొక్కసారి వీటి అడుగున పురుగులు ఉంటాయి. మనం చూసుకోకుండా కొత్త సరుకు అందులో వేసేస్తే దానికి కూడా పురుగు పడుతుంది. అందుకే, ఈ డబ్బాల్లో ఉన్న సరుకు అయిపోగానే డబ్బా సోప్ వాటర్ తో కడిగి ఆరబెట్టి అప్పుడు కొత్త సరుకు నింపుకుంటే ఈ ప్రాబ్లమ్ రాదు.
undefined
బ్లెండర్స్, మిక్సర్స్, మైక్రోవేవ్స్, ఓవెన్స్, గ్రిల్ల్స్, టోస్టర్స్ - ఏవైనా సరే చాలా క్లీన్ గా ఉండాలి. లేకపోతే వీటిలో ఫంగస్ చేరుతుంది. మిక్సీ జార్స్ లో తడి ఉండకుండా జాగ్రత్తగా ఆరబెట్టి ఉంచాలి.ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ కిచెన్, తద్వారా మీరు హెల్దీ గా ఉంటారు.
undefined
click me!