Om Island: ప్రకృతి సిద్ధంగా ‘ఓం’ ఆకారంలో ఏర్పడిన దీవి ఏదో తెలుసా? మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?

Published : Nov 16, 2026, 03:40 PM IST

Om Island: హిందూ సంప్రదాయం ప్రకారం ‘ ఓం’ ని చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇలాంటి ఓం ఆకారంతో... ప్రకృతి సహజంగా ఏర్పడిన దీవి ఒకటి మన దేశంలో ఉందని తెలుసా?

PREV
13
ఓం దీవి..

ప్రకృతి గీసిన ఒక అద్భుతమైన అక్షరం.. ఆకాశం నుండి చూస్తే అచ్చం హిందువుల పరమ పవిత్రమైన ఓం ఆకారంలో కనిపించే ఒక మాయాజాలపు దీవి. ఇది మనుషులు చెక్కింది కాదు, స్వయంగా ఆ ప్రకృతే నర్మదా నది మధ్యలో మలిచిన ఓ అద్భుత రూపం. మరి ఈ దీవి ఎక్కడ ఉంది? ఈ దీవిలో ఉన్న అద్భుత ఆలయం ఏంటి అనే విషయం ఇప్పుడు చూద్దాం...

మధ్యప్రదేశ్ లోని పవిత్ర నర్మదా నది అలల మధ్య ఈ ‘ఓం’ ఆకారంలో ఉన్న దీవి ఉంది. ఆ దీవిలోనే పవిత్ర ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ఆలయం కూడా ఉంది. మన దేశంలో మొత్తం 12 పరమ పవిత్రమైన జ్యోతిర్లింగాలు ఉంటే.. అందులో ఈ ఓంకారేశ్వర ఆలయం కూడా ఒకటి.

23
ఓంకారేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? దీని ప్రత్యేకత ఏంటి?

మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో పవిత్ర నర్మదా నది మధ్యలో ఉన్న ఒక చిన్న దీవిపై ఓంకారేశ్వర ఆలయం కొలువై ఉంది. ఈ దీవిని మాంధాత లేదా శివపురి అని పిలుస్తారు. ఈ దీవిని ఆకాశం నుండి చూస్తే అచ్చం హిందువుల పవిత్ర చిహ్నమైన ఓం ఆకారంలో కనిపిస్తుంది. ప్రకృతి సహజంగా ఏర్పడిన ఈ అద్భుత ఆకారం వల్లే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వరం అనే పేరు వచ్చింది. అంతేకాదు, ఇక్కడ పవిత్ర నర్మదా, కావేరీ నదుల సంగమం కూడా ఇక్కడే ఉండటం విశేషం.

ఈ ఆలయం దర్శించడానికి బెస్ట్ సమయం...

ఈ ఆలయం దర్శించడానికి అక్టోబర్ నుంచి మార్చి నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ నెలల్లో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, చల్లగా ఉంటుంది. ఆలయ దర్శనంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలను చూడటానికి ఇది చాలా అనువైన సమయం. ఏప్రిల్ తర్వాత ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి...ఆ సమయంలో ప్రయాణం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి, శ్రావణ మాసంలో ఇక్కడ సంబరాలు అంబరాన్ని అంటేలా జరుపుతారు. వీటిని చూడటానికి భక్తులు తరలివస్తారు.

33
ఈ ఆలయదర్శనానికి వెళ్లినప్పుడు తప్పక చేయాల్సిన 4 పనులు..

నర్మదా నదిలో పవిత్ర స్నానం: ఆలయ దర్శనానికి ముందు లేదా తర్వాత నర్మదా నదిలో స్నానం చేయడం వల్ల మనస్సు, ఆత్మ శుద్ధి అవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

సాయంత్రం నర్మదా హారతి: సూర్యాస్తమయం వేళ నర్మదా నది ఒడ్డున జరిగే హారతి కన్నుల పండువగా ఉంటుంది. వేద మంత్రోచ్ఛారణలు, దీపాల వెలుగుల మధ్య ఆ ఆధ్యాత్మిక వాతావరణం జీవితాంతం గుర్తుండిపోతుంది.

సస్పెన్షన్ బ్రిడ్జ్ (ఝూలా పుల్) పై నడక: నదికి, దీవికి మధ్య నిర్మించిన వేలాడే వంతెన పై నడుస్తుంటే నర్మదా నది అందాలు కట్టిపడేస్తాయి. ఫోటోగ్రఫీకి ఇది బెస్ట్ స్పాట్.

ఓంకారేశ్వర పరిక్రమ (గిరి ప్రదక్షిణ): భక్తులు 'ఓం' ఆకారంలో ఉన్న ఈ దీవి చుట్టూ కాలినడకన పరిక్రమ చేస్తారు. దారి పొడవునా కనిపించే చిన్న ఆలయాలు, ఘాట్లు, పచ్చని ప్రకృతి మనసును మైమరిపిస్తాయి. జీవితంలో ఒక్కసారి అయినా చూడాల్సిన ఆలయం ఇది.

Read more Photos on
click me!

Recommended Stories