Ragi Vs Oats: రాగి, ఓట్స్.. ఈ రెండింటిలో ఏది తింటే ఈజీగా బరువు తగ్గుతారో తెలుసా?

Published : Nov 16, 2026, 01:25 PM IST

Ragi Vs Oats: బరువు తగ్గడానికి చాలా మంది చాలా తిప్పలు పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడం అంత ఈజీ కాదు. మరి, ఓట్స్ , రాగులు ఏది తింటే.. ఈజీగా బరువు తగ్గుతారు?

PREV
13
బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?

బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చెట్టుకుపోయిన కొవ్వును కరిగించడం అనేది చాలా కష్టమైన పని. చాలా మంది బరువు తగ్గాలని తిండి మానేస్తారు. కొందరు మందులు వాడతారు. కఠినమైన డైట్స్, వ్యాయామాలు చేస్తూ ఉంటారు. కానీ, ఆరోగ్యకరంగా ఆహారం తీసుకొని కూడా బరువు తగ్గొచ్చు. అలాంటి వాటిలో.. రాగులు, ఓట్స్ పేర్లు చాలా ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. మరి, ఈ రెండింటిలో ఏది నిజంగా బరువు తగ్గించడంలో సహాయం చేస్తుంది? ఏది తీసుకోవడం ఉత్తమం..?

బరువు తగ్గించడంలో ఫైబర్ పాత్ర...

బరువు తగ్గాలంటే.. కచ్చితంగా మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ పుష్కలంగా ఉండాలి. బరువు తగ్గడంలో ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేసి, ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. దీని వల్ల అనవసరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. రాగులు, ఓట్స్ రెండింటిలోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కానీ, ఓట్స్ లో సాల్యుబుల్ ఫైబర్ ( కరిగే ఫైబర్) ఎక్కువగా ఉండి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. రాగుల్లో కరిగే, కరగని రెండు రకాల ఫైబర్లు ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

23
రాగులతో బరువు తగ్గడం ఎలా..?

దక్షిణ భారతదేశ వంటకాల్లో రాగులకు ఎప్పటినుంచో పెద్ద పీట ఉంది. 2021లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, రాగుల్లో గ్లూటెన్ ఉండదు , కాల్షియం బోలెడంత ఉంటుంది. అంతేకాదు, వీటి 'గ్లైసెమిక్ ఇండెక్స్' (GI) చాలా తక్కువ. అంటే ఇవి తిన్నప్పుడు రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగవు, దీనివల్ల పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. 2013 నాటి మరో పరిశోధన ప్రకారం.. రాగులు ఆకలిని బాగా కంట్రోల్ చేస్తాయి. దాంతో మనకు మధ్యమధ్యలో చిరుతిళ్లు తినాలనే ఆలోచనే రాదు. రాగులను రోటీలు లేదా జావ రూపంలో రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ఎంతో మంచిది.

33
ఓట్స్ తో బరువు తగ్గడం ఎలా..?

ప్రపంచవ్యాప్తంగా బరువు తగ్గాలనుకునే వారి ఫస్ట్ ఛాయిస్ ఓట్స్. 2023లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ఓట్స్‌లో ఉండే 'బీటా-గ్లూకాన్' అనే ప్రత్యేకమైన పీచుపదార్థం నేరుగా శరీరంలోని కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఓట్స్ మన శరీరానికి మెల్లమెల్లగా ఎనర్జీని ఇస్తాయి. దీనివల్ల తిన్న తర్వాత నీరసం రావడం గానీ, మళ్లీ వెంటనే ఆకలి వేయడం గానీ జరగదు.. ఫలితంగా పొట్ట కొవ్వు తగ్గుతుంది. తక్కువ క్యాలరీలతో, కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఎముకల బలానికి రాగులు: ఓట్స్‌తో పోలిస్తే రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువ. ముఖ్యంగా మహిళల ఎముకల ఆరోగ్యానికి రాగులు అమృతం లాంటివి.

కండరాల పుష్టికి ఓట్స్: ఓట్స్‌లో ప్రోటీన్, మంచి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాలను బలంగా ఉంచుతూ ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తాయి.

షుగర్ ఉన్నవారికి బెస్ట్: రాగుల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారికి , షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవాలనుకునే వారికి రాగులు సూపర్ ఛాయిస్.

రెండింటిలో ఏది తినాలి..? 

రాగులు ఆకలిని అదుపులో ఉంచి షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ చేస్తే.. ఓట్స్ నేరుగా పొట్ట కొవ్వుపై దాడి చేస్తాయి. కాబట్టి రెండింటిలో ఏదో ఒకటే తినాలని రూల్ పెట్టుకోకుండా, రెండింటినీ మార్చి మార్చి తినడమే అసలైన స్మార్ట్ ఐడియా.సాంప్రదాయ భోజనంలో రాగి ముద్ద, రోటీలు లేదా జావను.. హడావిడిగా ఉండే ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ కోసం ఓట్స్‌ను ఎంచుకుంటే పొట్ట కొవ్వు కరగడమే కాకుండా, మీ ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories