Bathroom: ఇంటిని రోజూ శుభ్రం చేస్తాం. బాత్రూమ్స్ ని వారానికో, 10 రోజులకో క్లీన్ చేస్తాం. దీంతో నీట్ గా ఉందనే అనుకుంటారు. కానీ బాత్రూంలో పెట్టే కొన్ని వస్తువుల గురించి పట్టించుకోరు. అసలు ఏమేం పెట్టకూడదో మొదట తెలుసుకోండి.
ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని అందరూ భావిస్తారు. ముఖ్యంగా బాత్రూమ్ను రోజూ క్లీన్ చేస్తుంటాం. కానీ అక్కడ ఏయే వస్తువులు ఉంచుతున్నామనేది కూడా గమనించాలి. బాత్రూమ్లో ఉండే తేమ, ఉష్ణోగ్రత మార్పుల వల్ల కొన్ని వస్తువులు పాడయ్యే ప్రమాదం ఉంది. తడిగా ఉండే వస్తువులు అలాగే ఉంచితే ఫంగస్ కూడా రావొచ్చు. కాబట్టి బాత్రూమ్లో అస్సలు పెట్టకూడని 7 ముఖ్యమైన వస్తువుల గురించి తెలుసుకుందాం.
27
మందులు, విటమిన్ ట్యాబ్లెట్లు
చాలా మంది మందులు, విటమిన్ ట్యాబ్లెట్లను బాత్రూమ్ క్యాబినెట్లో పెడుతుంటారు. కానీ అక్కడి తేమ, ఉష్ణోగ్రత వల్ల మందుల నాణ్యత, పనిచేసే తీరు దెబ్బతినే అవకాశం ఉంది. మందుల ప్యాకెట్ మీద ఉన్న సూచనల ప్రకారం వాటిని నిల్వ చేయాలి. పిల్లలకు అందకుండా చల్లగా, పొడిగా ఉండే చోట పెట్టడం మంచిది.
37
మేకప్ ప్రొడక్ట్స్
ఫేస్ క్రీములు, మస్కారా, మేకప్ బ్రష్లు లాంటివి బాత్రూమ్లో ఉంచడం మానుకోవాలి. అధిక తేమ వల్ల వాటి నాణ్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా తడిగా ఉండే మేకప్ బ్రష్లు, స్పాంజ్లలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. వాటిని శుభ్రం చేసి, పూర్తిగా ఆరబెట్టిన తర్వాతే పొడి ప్రదేశంలో భద్రపరచాలి.
హెయిర్ డ్రయ్యర్, హెయిర్ స్ట్రెయిట్నర్, కర్లింగ్ ఐరన్, మొబైల్ ఛార్జర్ లాంటివి బాత్రూమ్లో ఉంచకూడదు. నీరు, తేమ వల్ల ఎలక్ట్రానిక్ వస్తువులు పాడవుతాయి. తడి చేతులతో వాటిని ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంది. అలాగే పెర్ఫ్యూమ్లు, బాడీ స్ప్రేలను వేడి, తేమ, సూర్యరశ్మి తగలని చోట ఉంచడం మంచిది.
57
తడి బట్టలు
స్నానం చేసిన తర్వాత వాడిన బట్టలను బాత్రూమ్లోనే ఎక్కువసేపు తడిగా ఉంచకూడదు. గాలి ఆడని చోట అవి దుర్వాసన రావడంతో పాటు ఫంగస్ కూడా ఏర్పడుతుంది. అదనపు బట్టలు, బెడ్షీట్లను కూడా బాత్రూమ్లో స్టోర్ చేయొద్దు. పాత షేవింగ్ రేజర్లు, లూఫాలను కూడా తడిగా ఉంచకూడదు. వాటిని కడిగి ఆరబెట్టాలి. తుప్పు పట్టిన లేదా పాడైన రేజర్లను వెంటనే మార్చేయాలి.
67
పుస్తకాలు, పేపర్లు
కొందరికి బాత్రూమ్లో పుస్తకాలు, న్యూస్పేపర్లు చదివే అలవాటు ఉంటుంది. కానీ పేపర్లు తేమను త్వరగా పీల్చుకుంటాయి. దీనివల్ల పుస్తకాలు పాడవడమే కాకుండా వాటిపై ఫంగస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఫంగస్ వల్ల కొందరికి అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు రావొచ్చు. కాబట్టి పుస్తకాలు, పేపర్లను పొడి ప్రదేశంలో ఉంచడం మంచిది.
77
లూఫాలు, రేజర్లు
బాత్రూమ్లో రోజూ వాడే లూఫా (స్నానపు నార), షేవింగ్ రేజర్లలో తేమ అలాగే ఉంటే బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశం ఉంది. ప్రతిసారి వాడిన తర్వాత లూఫాను బాగా కడిగి ఆరబెట్టాలి. పాడైపోయిన లేదా చాలా కాలంగా వాడుతున్న వస్తువులను మార్చడం మంచిది.