Car Care Tips: వర్షాకాలం కారులో దుర్వాసనకు కారణమేంటీ? ఆ వాసన పోవాలంటే..?

Published : Jul 08, 2025, 05:30 PM IST

Car Care Tips: ఎంత ఖరీదైన కారు అయిన లోపల అప్పుడప్పుడు దుర్వాసన వస్తుంది. తడి, దుమ్ము, దూళి పేరుకపోవడం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది. అయితే, కారులో చెడు వాసన రాకుండా ఏం చేయాలి?  దాన్ని పోగొట్టడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

PREV
17
వర్షాకాలంలో కారులో దుర్వాసన వస్తుందా?

వర్షాకాలంలో తేమ వల్ల ఇంట్లో ఒక రకమైన వాసన వస్తుంది. అది సాధారణమే. అలాగే కారులో కూడా దుర్వాసన వస్తుంది. వర్షాకాలంలో కారు ని సరిగ్గా శుభ్రం చేయకపోతే తేమ వల్ల దుర్వాసన వస్తుంది. ఆ వాసన పోవడానికి చాలా మంది కారులో AC వాడతారు. కానీ, అది పరిష్కారం కాదు. ఈ సమస్యని సహజంగా పరిష్కరించడానికి కొన్ని చిట్కాలు మీ కోసం..  

27
ఉల్లిపాయతో దుర్వాసనకు చెక్!

కారులో వచ్చే తేమ వాసనను తొలగించడానికి ఉల్లిపాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక ఉల్లిపాయను ముక్కలు చేసి ప్లేట్‌లో వేసి, రాత్రంతా కారులో ఉంచండి. ఇది కారులోని దుర్వాసనను శోషిస్తుంది. ఉదయం కారు తలుపులు, కిటికీలు తెరిచి కొంత సేపు గాలి వదిలితే, ఉల్లిపాయ వాసన కూడా పోతుంది. 

37
బిర్యానీ ఆకు, లవంగాలు :

ఒక చిన్న బట్ట సంచిలో 2 బిర్యానీ ఆకులు  , 4–5 లవంగాలు వేసి గట్టిగా కట్టి, కారులో అద్దం దగ్గర వేలాడదీయండి. ఇవి సహజ సుగంధాలను విడుదల చేసి కారులోని తేమ వాసనను తొలగిస్తాయి. కెమికల్స్ లేని, ప్రకృతి సిద్ధమైన ఎయిర్ ఫ్రెషనర్ గా పని చేస్తుంది. 

47
బేకింగ్ సోడా, వెనిగర్ :

కారులో దుర్వాసన ఎక్కువగా ఉంటే, ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా లేదా వెనిగర్ తీసుకుని సీటు కింద ఉంచండి. ఇవి రెండూ సహజ వాసన శోషకాలు కావడంతో, తేమ వల్ల వచ్చే దుర్వాసనను తొలగిస్తాయి.

57
వేప ఆకులు:

వేపాకులతో కారులో తేమకు బ్రేక్. ఒక చిన్న బట్ట సంచిలో వేపాకులు వేసి కారులో వేలాడదీయండి లేదా సీటు కింద ఉంచండి. వేపాకు తేమను శోషించడమే కాదు, బ్యాక్టీరియా,  దుర్వాసనను కూడా అరికడుతాయి. 

67
చెక్క బూడిద :

ఒక క్లాత్ లో చెక్క బూడిద వేసి కారులో ఉంచండి. బూడిద తేమను, దుర్వాసనను పీల్చుకుంటుంది. ఇది సహజమైన పరిష్కారం.  

77
తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కారును ప్రతిరోజూ శుభ్రంగా ఉంచండి. తడిబట్టలు, గొడుగులు, ఆహార పదార్థాలు కారులో ఉంచకండి. ఇవి తేమ, వాసనకు కారణమవుతాయి. కారు కిటికీలు, తలుపులు అప్పుడప్పుడు తెరిచి గాలి ప్రసరణ జరిగేలా చూడండి. అలాగే AC ఫిల్టర్లను కూడా క్రమం తప్పకుండా శుభ్రపరచండి.

Read more Photos on
click me!

Recommended Stories