ఆరోగ్య ప్రయోజనాలు..
ఇంకొక విశేష కారణం ఏమిటంటే, శ్రావణ మాసం కాలంలో పశుపక్ష్యాదులు, జీవరాశుల ప్రాణాలను కాపాడాలన్న ఉద్దేశంతో, హింసకు దూరంగా ఉండాలన్న నైతిక దృష్టితో మాంసాహారం మానవలసినదిగా సూచిస్తారు. ఇది "అహింసా పరమో ధర్మః" అనే హిందూ తత్వాన్ని గుర్తుచేస్తుంది.
ఇటీవల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన నేపథ్యంలో, చాలా మంది శ్రావణ మాసాన్ని డిటాక్స్ మాసంగా (natural detox month) ఫాలో అవుతున్నారు. ఆ సమయంలో తక్కువ మసాలా, తేలికపాటి ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన విశ్రాంతి లభిస్తుంది. జీర్ణ వ్యవస్థకు పనిభారం తగ్గుతుంది. అంతేకాకుండా, శివునికి ఇష్టమైన శాకాహారాన్ని తీసుకోవడం వల్ల ఆధ్యాత్మికంగా కూడా తృప్తి కలుగుతుంది.
ఈ మాసంలో వచ్చే పండుగలు – నాగపంచమీ, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ శుక్రవారం, కృష్ణాష్టమి, రాఖీ వంటి పర్వదినాల సమయంలో పూజలు జరపడం కోసం శాకాహారానికి ప్రాధాన్యం ఇస్తారు. ఆ పండుగలన్నింటికీ ఒక పవిత్రత, నియమశీలత అవసరం. శారీరకంగా శక్తివంతంగా ఉండేందుకు తేలికపాటి ఆహారం కీలకం అవుతుంది.
మొత్తంగా చెప్పాలంటే, శ్రావణ మాసంలో మాంసాహారం మానేయడం అనేది ఒక సంప్రదాయం మాత్రమే కాదు. ఇది మన శరీరానికి, మనస్సుకు, ఆధ్యాత్మిక అభివృద్ధికి మార్గదర్శకంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు నియమాలు రూపొందించిన భారతీయ సంప్రదాయంలో, శ్రావణ మాసంలోని శాకాహార విధానం అనేది శాస్త్రీయంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా గొప్ప జీవనశైలిని ప్రతిబింబిస్తుంది.