Lunch Box Recipes: తక్కువ సమయంలో రుచికరమైన లంచ్ బాక్స్ సిద్ధం చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీలు మీకోసమే. ఇక్కడ నిమిషాల్లో తయారయ్యే ఈజీ, టేస్టీ రెసిపీ ఐడియాస్ ఉన్నాయి. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. మరి ఆలస్యమెందుకు ట్రై చేయండి.
ప్రతిరోజూ లంచ్ బాక్స్‌లో ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? ఎప్పుడూ ఒకే రకమైన వంటకాలతో బోర్ కొడుతోందా? అయితే ఈజీగా, తక్కువ సమయంలో తయారయ్యే ఈ రుచికరమైన లంచ్ బాక్స్ రెసిపీలు మీకోసమే. వీటిని ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే చకచకా చేసేయవచ్చు. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే ఈ టేస్టీ రెసిపీలు మీ శ్రమ, సమయాన్ని ఆదా చేయడంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. మరి ఆలస్యమెందుకు ఓసారి ట్రై చేసి చూడండి.
26
నువ్వులు, వెజిటెబుల్ రైస్
రోజును యాక్టివ్‌గా మొదలుపెట్టడానికి నువ్వుల అన్నం బెస్ట్ ఆప్షన్. నల్ల నువ్వులను దోరగా వేయించి, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, మినపప్పు కలిపి పొడి చేసుకోవాలి. ఈ నువ్వుల పొడిని, వేయించిన కూరగాయలను అన్నంలో వేసి నువ్వుల నూనెతో కలపాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే పొడి కలపకూడదు. అన్నం కాస్త చల్లారాక నువ్వుల నూనె వేసి కలిపితే, సాయంత్రం వరకు అన్నం పొడిపొడిగా ఉంటుంది. నువ్వుల చేదు తెలియకుండా మంచి సువాసన వస్తుంది.
36
ఉలవల రైస్
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రోజంతా యాక్టివ్‌గా ఉంచే శక్తి ఉలవలకు ఉంటుంది. ఉడికించిన ఉలవలను వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు, జీలకర్ర, టమాట వేసి తాలింపు పెట్టుకోవాలి. దీన్ని అన్నంలో కలిపి లంచ్ బాక్స్‌లో సర్దుకోవచ్చు. ఉలవలు ఉడికించిన నీళ్లను పారబోయకుండా, తాలింపు వేసేటప్పుడు కొద్దిగా కలిపితే అన్నం గట్టిపడదు. మధ్యాహ్నం వరకు చాలా సాఫ్ట్‌గా ఉంటుంది.
కొర్ర బియ్యంతో పాటు పెసరపప్పు, సన్నగా తరిగిన క్యారెట్, బీన్స్ వేసి ఉడికించాలి. ఆ తర్వాత నెయ్యిలో జీడిపప్పు, జీలకర్ర, మిరియాలు, అల్లం వేసి తాలింపు పెట్టుకోవాలి. మధ్యాహ్నానికి కొర్రల పొంగల్ గట్టిపడకుండా ఉండాలంటే, స్టవ్ ఆఫ్ చేసే ముందు అర గ్లాసు కాచిన పాలు పోసి కలపాలి. ఇలా చేస్తే సాయంత్రం వరకు పొంగల్ సాఫ్ట్‌గా ఉంటుంది.
56
ఉసిరికాయ, కొత్తిమీర రైస్
రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరికాయ, శరీరంలోని వ్యర్థాలను తొలగించే కొత్తిమీర కలిపి చేసే రిఫ్రెషింగ్ రైస్ ఇది. తురిమిన ఉసిరికాయ, కొత్తిమీర పేస్ట్‌ను నూనెలో వేయించి అన్నంలో కలుపుకోవాలి. ఉసిరికాయ వగరు తెలియకుండా ఉండాలంటే, తాలింపులో చిటికెడు ఇంగువ, వేయించిన పల్లీలు కలపాలి. అప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
66
వెల్లుల్లి, కరివేపాకు రైస్
జీర్ణ వ్యవస్థను సెట్ చేయడానికి, శరీరానికి రిఫ్రెష్‌మెంట్ ఇవ్వడానికి వెల్లుల్లి, కరివేపాకు రైస్ చాలా మంచిది. నీడలో ఆరబెట్టిన కరివేపాకుతో పాటు వెల్లుల్లి రెబ్బలను నువ్వుల నూనెలో వేయించి, మిక్సీ పట్టి అన్నంలో కలుపుకోవాలి. వెల్లుల్లిని పూర్తిగా వేయకుండా కాస్త కచ్చాపచ్చాగా దంచి వేయాలి. అలాగే తాలింపులో నెయ్యికి బదులు స్వచ్ఛమైన నువ్వుల నూనె వాడితే అన్నం సువాసన ఎక్కువసేపు ఉంటుంది.