Potatoes: బంగాళాదుంపలు ప్రతి ఇంట్లో ఉంటాయి. ఆలుగడ్డల కూర చాలా రుచిగా ఉంటుంది. వీటిని ఉడికించేటప్పుడు నీటిలో ఒక పదార్థం వేయడం వల్ల దుంపలు బాగా ఉడుకుతాయి. అలాగే కూర రుచిగా వస్తుంది.
వారానికి ఒకసారి అయిన బంగాళాదుంపల కూరను తింటూ ఉంటారు. ముందుగా వాటిని ఉడికించిన తరువాత కూర వండుతారు. చాలామంది నీళ్లు మరిగిన తర్వాత దుంపలను అందులో వేసి ఉడకబెడతారు. అలా కాకుండా ముందుగానే ఒక గిన్నెలో చల్లటి నీటిని తీసుకుని బంగాళాదుంపలు పూర్తిగా మునిగేలా ఉంచిన తర్వాతే పొయ్యి వెలిగించాలి. దీనివల్ల నీటి వేడితో పాటే దుంపలు కూడా లోపలి నుంచి బయటి వరకు సమానంగా వేడెక్కి మంచిగా ఉడుకుతాయి. అదే నేరుగా వేడి నీటిలో వేస్తే పై పొర త్వరగా మెత్తబడిపోయి పిండిలా చిదిమిపోతుంది, లోపల మాత్రం గట్టిగా పచ్చిగానే ఉండిపోతుంది. ముక్కలుగా కోసి ఉడికించే పనైతే అన్నీ ఒకే పరిమాణంలో ఉండేలా చూసుకుంటే అన్నీ ఒకే సమయంలో ఉడుకుతాయి.
23
ఉడికించిన నీళ్లలో ఉప్పు
బంగాళాదుంపలు ఉడికించడానికి ముందే నీటిలో తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల అద్భుతమైన రుచి వస్తుంది. ఉడికే క్రమంలోనే ఉప్పు దుంప లోపలి దాకా వెళ్లి ప్రతి ముక్క రుచికరంగా మారుతుంది. సాధారణంగా ఉడకబెట్టిన దుంపలకు మరింత తాజాదనం, సువాసన రావాలనుకుంటే నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండవచ్చు. అలాగే ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు (బే లీవ్స్), నలిపిన వెల్లుల్లి లేదా పుదీనా, కొత్తిమీర లాంటి హెర్బ్స్ వేస్తే దుంపలకు మంచి ఆరోమా వచ్చి మరింత రుచిగా ఉంటాయి. ఉడికిన తర్వాత వీటిని సులభంగా తీసేయవచ్చు.
33
బంగళాదుంప మెత్తగా అవ్వకుండా
బంగాళాదుంప సలాడ్స్, వేపుళ్లు లేదా రోస్ట్ చేసుకునేటప్పుడు ఆలు ముక్కలు చితికిపోకుండా గట్టిగా ఉండటం ముఖ్యం. దీనికోసం ఉడికించే నీటిలో కొద్దిగా వెనిగర్ కలపాలి. వెనిగర్‌లోని స్వల్ప ఆమ్ల గుణం దుంప పైపొరలను దృఢంగా ఉంచి, కలిపినప్పుడు అవి ముద్ద కాకుండా చూస్తుంది. ఇక వండేటప్పుడు నీరు మరగడం ప్రారంభించగానే మంటను వెంటనే తగ్గించి, మూతపెట్టి మీడియం లేదా సిమ్‌లో నెమ్మదిగా ఉడకనివ్వాలి. పెద్ద మంట మీద ఉడికిస్తే నీటి బుడగల ఒత్తిడికి ముక్కలు ఒకదానికొకటి వేగంగా ఢీకొని విరిగిపోయి, స్టార్చ్ అంతా నీటిలో కలిసిపోయి కూర పాడవుతుంది.