long hair అంతా మిమ్మల్నే చూసేలా పొడవాటి జుట్టు పెరగాలంటే..

పొడవాటి జుట్టు ఉన్న అమ్మాయిలకు ఓపిక ఎక్కువ అంటుంటారు. ఓపికే కాదు.. ఆడవాళ్లలో జుట్టు పొడుగ్గా పెరిగితే అందం కూడా రెట్టింపు అవుతుంది. మరి ఆ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలంటే ఏం చేయాలి? బయోటిన్ అధికంగా ఉంటే ఆహారం తీసుకోవాలి. అది ఎందులో పుష్కలంగా ఉంటుందో మీకు తెలుసా? 

long hair Biotin-rich foods for long Hair in telugu

గోళ్ల పెరుగుదలకే కాదు.. జుట్టు పెరుగుదలకూ బయోటిన్ ఎంతో ముఖ్యం. ఈ విటమిన్ ఉన్న డైట్‌ తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది. కొన్ని ఆహారాలలో సహజసిద్ధంగా బయోటీన్‌ ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్‌లో చేర్చుకోవాలి. ఇది కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకునే హెయిర్ కేర్ తీసుకోవాలి. అప్పుడే జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది. కుదుళ్లు నుంచి దృఢంగా మారుతుంది.

బయోటిన్ నే విటమిన్ బి7 అని అంటారు. అది పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలివి. 

వాల్ నట్స్ ..
మన రెగ్యులర్‌గా వాల్‌నట్స్‌ నానబెట్టి తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి బయటీన్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. దీంతో జుట్టుకు మంచి పోషణ దక్కుతుంది.  వాల్ నట్స్ ని స్మూథీల్లో భాగం చేసుకొని తీసుకోవచ్చు. 

సన్‌ఫ్లవర్ గింజలు..
సన్‌ఫ్లవర్ గింజల్లో బయోటీన్‌ విపరీతంగా ఉంటుంది. ఇందులో ఖనిజాలు కూడా ఉంటాయి. వీటిని సలాడ్‌లో చల్లుకొని తీసుకోవాలి. పెరుగు లేదా ఓట్మీల్‌లో కూడా వేసుకొని తీసుకోవచ్చు. జుట్టును బలంగా తయారవుతుంది.

స్వీట్ పొటాటో..
ఇందులో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. బయోటీన్‌ కూడా ఉంటుంది. ఇందులో బీటా కెరోటీన్‌ కూడా ఉంటుంది. ఇది విటమిన్ ఏ గా మారుస్తుంది. తద్వారా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. చిలకడదుంపను ఉడికించి తీసుకోవచ్చు. లేదా మెత్తగా రుబ్బి సూప్ రూపంలో కూడా తీసుకోవచ్చు.


బాదం..బాదం తరచూ తీసుకుంటుంటే మనకు బయోటీన్‌ మెండుగా అందినట్టే. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి.  వీటిని మనం తీసుకునే స్నాక్స్ లో భాగం చేసుకోవాలి. స్మూతీల్లో కూడా వేసుకొని  తిన్నా ప్రయోజనం ఉంటుంది.

పాలకూర..
పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉండటంతోపాటు బయోటిన్ పెద్దస్థాయిలో ఉంటుంది. మనం వండుకునే కూరలో తరచూ పాలకూర ఉండేలా చేసుకోవాలి. లేదంటే  స్మూథీలా తీసుకోవడం వల్ల మన జుట్టుకు బయోటిన్ పోషణ దక్కుతుంది.

Latest Videos

vuukle one pixel image
click me!