ఈ ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. రెండు చెంచాల ముల్తానీ మట్టికి తగిన సహజ పదార్థాలను కలిపి మెత్తటి పేస్ట్‌లా చేసుకుని ముఖం, మెడ భాగంలో రాయాలి. 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచి, ఆరిన తర్వాత చల్లటి లేదా సాధారణ నీటితో మెల్లగా మసాజ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి. ఫేస్ ప్యాక్‌లో పసుపు ఉపయోగిస్తున్నట్లయితే కేవలం చిటికెడు మాత్రమే కలపాలి. లేదంటే ముఖం పసుపు రంగులోకి మారే అవకాశం ఉంది. ఈ ప్యాక్‌లను వారానికి ఒకటి లేదా రెండు సార్లు వాడడం వల్ల చర్మ సమస్యలు తగ్గి, ముఖం కెమికల్స్ ప్రభావం లేకుండా అందంగా మారుతుంది.