Expensive Fruit: రెండు పండ్లు రూ.34 లక్షలు.. ఈ పండు కొనాలంటే మినిమమ్ అంబానీలు అవ్వాలి..!

Published : Aug 04, 2026, 05:31 PM IST

Expensive Fruit: ఒక పండు ధర ఎంత ఉంటుంది? ఎంత ఖరీదైన వందల్లో.. మహా అంటే.. వేలల్లో ఉంటుంది. కానీ, లక్షల ఖరీదు చేసే పండు గురించి ఎప్పుడైనా విన్నారా? ఐఫోన్ కంటే ఖరీదైన ఈ పండు ఎక్కడ దొరుకుతుంది?

PREV
14
ప్రపంచంలోనే ఖరీదైన పండు...

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే, రెగ్యులర్ గా మన డైట్ లో పండ్లు భాగం చేసుకోవాలని డాక్టర్లు కూడా చెబుతుంటారు. మనకు చాలా రకాల పండ్లు చాలా తక్కువ ధరకే చాలా ఈజీగా లభించేస్తాయి. కానీ, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు గురించి మీరు విన్నారా? ఈ పండు ధర వింటే.. దానిని తినాలి, కొనాలి ఆలోచన కూడా మన మైండ్ లోకి రాదు. ఐఫోన్ కంటే.. 15 రెట్లు ధర ఎక్కువ ఉన్న ఈ పండు ఎక్కడ దొరుకుతుందో ఇప్పుడు చూద్దాం...

24
అత్యంత ఖరీదైన పండు...

ఈ ఖరీదైన పండు పేరు ‘యుబారి కింగ్ మెలన్’( Yubari King Melon). చూడటానికి అచ్చం ఖర్బూజా పండులానే ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండులో ఇది కూడా ఒకటి. ఈ పండ్లు అన్ని చోట్లా లభించవు. కేవలం జపాన్ లో మాత్రమే పండుతుంది. ఈ తొలి పంట పండగానే తొలి పంటను వేలం పాట వేస్తారు. 2026లో వేసిన వేలంపాటలో... ఒక జంట ఈ యుబారి కింగ్ మెలన్ పండ్లు.. ఏకంగా 5.8 మిలియన్ యెన్ లకు అమ్ముడయ్యాయి. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.34లక్షలు. అలా అని... ఈ పండు ప్రతిసారీ ఇంత ఖరీదు ఉండదు. తొలి పంటకు మాత్రం చాలా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఈ ధరకు అమ్ముడైంది.

34
సాధారణ మార్కెట్ లో ఈ పండు ధర ఎంత ఉంటుంది?

తొలి పంట వేలం పాట వేసినప్పుడు ఈ పండు అత్యంత ఎక్కువ ధర పలికినా.. ఆ తర్వాత సాధారణ మార్కెట్ లో.. కాస్త తక్కువ ధరకే ఈ పండ్లు లభిస్తాయి. ఈ పండ్లను గ్రేడ్ల రూపంలో విభజించి అమ్ముతారు.

సాధారణ పండు 20 వేల నుంచి 50 వేల యన్ లు ఉంటుంది. అంటే మన కరెన్సీలో 12వేల నుంచి 30 వేల వరకు ధర పలికే అవకాశం ఉంటుంది. ఇక ప్రీమియం గిఫ్ట్ గ్రేడ్ పండ్లకు కాస్త డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇవి సుమారు మన కరెన్సీలో రూ.60వేల వరకు పలుకుతాయి.

44
ఈ పండు ఎందుకు ఇంత ఖరీదు..?

ఈ పండు చూడటానికి మనకు చాలా ఈజీగా దొరికే ఖర్బూజా పండులానే ఉంటుంది. మరి, దీనికి ఎందుకు ఇంత ఖరీదు అంటే.. ఈ యుబారి కింగ్ సహజంగా పండే పండు కాదు. ఇది.. రెండు ప్రత్యేకమైన కాంటలోప్ రకాల హైబ్రిడ్ పండు. కృత్రిమంగా పండించారు. అంతేకాదు, ప్రత్యేకమైన వాతావరణంలో పండిస్తారు. జపాన్ లోని హైక్కైడో ప్రాంతంలో ఉన్న యుబారి అనే చిన్న ఊరిలోని గ్రీన్ హౌస్ లలో మాత్రమే దీనిని పండిస్తారు. రైతులు పంట వేసిన దగ్గర నుంచి.. చేతికి వచ్చే వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కంటికి రెప్పలా చూసుకుంటారు. సరైన ఉష్ణోగ్రత, సరిపడా నీరు అందేలా చూసుకుంటారు. అంతేకాదు. సైజు, షేప్ మారకుండా.. గుండ్రంగా పండేలా చూసుకుంటారు. అందుకే, ఈ పండుకు ఇంత ఖరీదు.

ఖరీదైన గిఫ్ట్..

జపాన్ లో ఖరీదైన పండ్లను బహుమతిగా ఇవ్వడం ఒక గొప్ప సంప్రదాయంగా భావిస్తారు. ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాపార ఒప్పందాలు, వివాహాలు, ప్రత్యేక వేడుకల సమయంలో ఈ పండను గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు. తమ స్టేటస్ కి సింబల్ గా ఈ పండును చూస్తారు. కేవలం పండుగానే కాకుండా.. విలాసానికీ, హోదా,గౌరవానికి ప్రతీకగా చూడటం వల్ల ఈ పండు ఎప్పుడూ భారీ ధర పలుకుతూ ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories