ప్రతి ఒక్కరికీ పొడవాటి జుట్టు కావాలనే కోరిక ఉంటుంది. అలాగే మందంగా, ఒత్తుగా ఉండాలని కోరుకుంటారు. కానీ దుమ్ము, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల జుట్టు అతిగా రాలిపోతుంది. దీనికి కొన్ని ఇంటి నివారణలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా వెల్లుల్లి రసం, ఉల్లిపాయ రసం అనేది జుట్టుకు అద్భుతంగా పనిచేస్తాయి.