Periods: కొన్నిసార్లు పీరియడ్స్ సమయానికి రావు. దీనివల్ల మహిళలకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రతిసారీ మందులు వాడాల్సిన అవసరం లేకుండా చిన్న ఇంటి చిట్కాల ద్వారా సమయానికి పీరియడ్స్ వచ్చేలా చేయవచ్చు.
సాధారణంగా ప్రతి స్త్రీకి 28 రోజుల నుండి 35 రోజుల మధ్య పీరియడ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, ఆహారంలో తీవ్ర మార్పులు వంటివి పీరియడ్స్ ను ఆలస్యం చేస్తాయి. ఇలా పీరియడ్స్ ఆలస్యమైనప్పుడల్లా స్త్రీలు కంగారు పడతారు. కొన్నిసార్లు ప్రయాణాలు ఉన్నా, పండుగలు ఉన్నా ముందే పీరియడ్స్ వస్తే మంచిదని కోరుకుంటారు. అలాంటివారు మందులు వాడాల్సిన అవసరం లేకుండా పీరియడ్స్ ను సమయానికి లేదా వీలైనంత ముందుకు వచ్చేలా చేయవచ్చు. ఇందుకోసం చిట్కాలను ఇక్కడ ఇచ్చాము.
25
పచ్చి బొప్పాయి తింటే
పీరియడ్స్ రావాలని కోరుకుంటే మీరు పొత్తికడుపుపై హీటింగ్ ప్యాడ్ ఉంచి రక్తప్రసరణను పెంచండి. గోరువెచ్చని నీటిలో వస్త్రాన్ని ముంచి దాన్ని పొత్తికడుపు పై ఉంచినా సరిపోతుంది. దీనివల్ల అక్కడ రక్తప్రసరణ వేగవంతం అవుతుంది. గర్భాశయ కండరాలను సడలించి రుతుస్రావం త్వరగా వచ్చేలా చేస్తాయి. అలాగే పచ్చి బొప్పాయి తినడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. పచ్చి బొప్పాయి గర్భాశయాన్ని ప్రేరేపిస్తుంది. గర్భాశయంలోని ఎంజైమ్‌లు.. హార్మోన్ల సమతుల్యతను కాపాడేందుకు సహాయపడతాయి. రోజుకు రెండుసార్లు పచ్చి బొప్పాయి తినేందుకు ప్రయత్నిస్తే త్వరగా పీరియడ్స్ వచ్చేస్తాయి.
35
బెల్లం కషాయం
ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను సెలెరీ వేయండి. అందులో కొద్దిగా బెల్లం వేసి మరిగించండి. ఉదయాన లేచాక ఖాళీ పొట్టతో తాగేందుకు ప్రయత్నించండి. ఇది ఋతుచక్రం త్వరగా మొదలయ్యేలా చేస్తుంది. అలాగే అల్లం టీ లేదా తులసి టీని కూడా ప్రయత్నించవచ్చు. అల్లం తినడం వల్ల రక్త ప్రవాహం శరీరంలో పెరుగుతుంది. తులసి కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడకుండా కాపాడుతుంది. అల్లం, తులసి రెండూ కలిపి టీ చేసుకొని తాగితే పీరియడ్స్ సమయానికి వస్తాయి. కొన్నిసార్లు ముందే రావచ్చు.
విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు కూడా పీరియడ్స్ వచ్చేందుకు ఉపయోగపడతాయి. నారింజ, నిమ్మ, జామ వంటి పనులు అధికంగా తినండి. విటమిన్ సి శరీరంలో చేరాక ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల గర్భాశయ లైనింగ్ వేగంగా తొలగిపోతుంది. అప్పుడు వెంటనే పీరియడ్స్ మొదలవుతాయి. శారీరక శ్రమ అనేది కూడా పీరియడ్స్ రాకను పెంచుతుంది. ఎందుకంటే వ్యాయామం అనేది రక్తప్రసరణ శరీరంలో వేగవంతం చేస్తుంది. హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. ఇవన్నీ కూడా రుతు చక్రాన్ని ప్రారంభించేలా చేస్తాయి.
55
ఒత్తిడి లేకుండా
ఒత్తిడి వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల మీరు ఒత్తిడిని అధిగమించవచ్చు. మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఇది మీ రుతు చక్రాన్ని క్రమంలో ఉంచుతుంది. అయితే ప్రతినెలా సమయానికి రుతుస్రావం కాకపోయినా, ప్రతినెలా ఆలస్యంగా వస్తున్నా.. అది ఏదైనా వైద్య పరిస్థితికి కారణం కావచ్చు. పీసీఓడీ, థైరాయిడ్ వంటివి వాటి వల్ల కూడా సమయానికి పీరియడ్స్ రావు. కాబట్టి వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది.