మజ్జిగ సహజసిద్ధమైన ప్రోబయోటిక్ డ్రింక్. ఇందులో కేలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఎంతైనా తాగవచ్చు. కేవలం మజ్జిగ తాగడం కంటే, అందులో చిటికెడు జీలకర్ర పొడి కలిపి తాగితే ఎంతో మంచిది. జీలకర్ర కేవలం వంటలకు రుచినిచ్చే మసాలా దినుసు మాత్రమే కాదు, ఇది ఔషధాలు కలిగిన పదార్థం. జీలకర్రలో ప్రోటీన్, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి, కె, ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పరిశోధనల ప్రకారం, జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయని కూడా తేలింది.