Masala Dosa: బ్రేక్‌ఫాస్ట్‌కు మసాలా దోశె మంచిది కాదా? తినడం వల్ల ఏం లాభం లేదా? కారణాలు ఇవే

Published : Apr 14, 2026, 08:09 AM IST

Masala Dosa: బ్రేక్‌ఫాస్ట్‌కు మసాలా దోశను ఇష్టంగా తినేవారు ఎక్కువ. కానీ ఆ దోశె తినడం వల్ల ఎలా ఆరోగ్య లాభాలు లేవనే చర్చ నడుస్తోంది. మసాలా దోశ తిన్నాక శక్తి రావాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఏం చేయాలో తెలుసుకోండి.

PREV
14
మసాలా దోశ మంచిది కాదా?

దోశ, ఇడ్లీ, సాంబార్, ఉప్మా.. మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్. ఇవి తింటే పొట్టకు హాయిగా ఉంటుంది, తేలికగా అరిగిపోతాయని అనుకుంటాం. కానీ ఈ లిస్ట్‌లో మసాలా దోశ మాత్రం చేర్చూడదట. నిజానికి దోశ ఆరోగ్యానికి చెడ్డదేం కాదు, కానీ దానిలో ఉండాల్సిన ముఖ్యమైన పోషకం మాత్రం ఉండదు, అందుకే మసాలా దోశె తినడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అంటారు. 

24
వైరల్ వీడియో

సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ సిద్ధార్థ్ సింగ్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో మసాలా దోశ బ్రేక్‌ఫాస్ట్‌కు సరైనది కాదని చెప్పారు. బరువు తగ్గాలనుకునే వాళ్లు ఉదయాన్నే మసాలా దోశ తినొద్దని కూడా ఆయన సలహా ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

సిద్ధార్థ్ సింగ్ మసాలా దోశ ఆరోగ్యాన్ని పాడుచేయదు. బియ్యం, మినపప్పు, కరివేపాకు వంటి ఆరోగ్యకరమైన పదార్థాలనే ఇందులో వాడతారు. పప్పుతో సాంబార్ చేస్తారు కాబట్టి ఇది ఆరోగ్యానికి హానికరం కాదు. కానీ  ఇది తిన్నాక త్వరగా ఆకలి వేస్తుంది.

34
తిన్న కాసేపటికే ఆకలి!

బియ్యం, పప్పులతో చేసిన ఈ మసాలా దోశ చాలా తేలికగా జీర్ణమవుతుంది. తిన్న వెంటనే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. కానీ కొన్ని గంటల్లోనే మళ్లీ ఆకలి వేస్తుంది. దీంతో మీరు మళ్లీ ఏదో ఒకటి తింటారు. ఇది మీ క్యాలరీలను పెంచుతుంది. దోశ వల్ల బరువు పెరగరు. కానీ దోశ తిన్న తర్వాత జరిగే ప్రక్రియ వల్ల ఆకలి పెరుగుతుంది. దీన్నే 'గ్లైసెమిక్ రెస్పాన్స్' అంటారు. మీ రక్తంలో చక్కెర వేగంగా పెరిగి, అంతే వేగంగా పడిపోతుంది. అందుకే మళ్లీ ఆకలి త్వరగా వేస్తుంది.

44
దోశ ఎలా తింటే మంచిది?

అలాగని మసాలా దోశ తినడం మానేయాల్సిన అవసరం లేదు. కానీ దోశ పిండిని కాస్త మార్చాలి. అసంపూర్ణంగా ఉన్న దోశను సంపూర్ణంగా మార్చాలి. మసాలా దోశకు పనీర్ కలపండి. దోశ లోపల పెట్టే ఆలూ కూరలో పనీర్ చేర్చండి. ఇలా ప్రోటీన్ జోడిస్తే మీరు సమతుల్య ఆహారం తీసుకున్నట్టు అవుతుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ప్రొటీన్ ఉన్న బ్రేక్ ఫాస్ట్ లే ఆరోగ్యోనికి మేలు చేస్తాయి. 

పనీర్ వద్దనుకుంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఇతర పదార్థాలను కూడా కలిపి తినొచ్చు. మసాలా దోశతో పాటు ఇక ఉడికించిన గుడ్డు తినండి. పల్లీల చట్నీ లేదా కొబ్బరి చట్నీతో దోశ తిన్నాప్రొటీన్ శరీరానికి అందుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories