Chanakya Niti: మనుషుల నుంచి కాదు.. కాకిని చూసి ఇవి నేర్చుకోండి...

Published : Apr 13, 2026, 06:05 PM IST

 Chanakya Niti: మనం మన జీవితంలో ఎలా ప్రవర్తించాలి? మంచి, చెడులకు వ్యత్యాసం ఎలా గుర్తించాలి? కష్టాలను ఎలా ఎదుర్కోవాలి? విజయం ఎలా సాధించాలి అనే విషయాలను చాణక్య నీతి వివరిస్తుంది.. 

PREV
13
చాణక్య నీతి...

జీవితంలో విజయం సాధించాలి అంటే రాత్రి, పగలు అనే తేడా లేకుండా కష్టపడటం ఎంత ముఖ్యమూ.. మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూసి నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. కేవలం మనుషులు మాత్రమే కాదు.. జంతువులు కూడా మనకు ఎలా జీవించాలి అనే విషయాన్ని నేర్పిస్తాయి. ముఖ్యంగా కాకి నుంచి ఐదు విషయాలు నేర్చుకుంటే...లైఫ్ లో ఆ వ్యక్తికి తిరుగు అనేది ఉండదు అని చాణక్యుడు చెబుతున్నాడు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...

23
1.వ్యక్తిగత విషయాలను దాచుకోవడం...

కాకి తన వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోదు. తనలోనే దాచుకుంటుంది. అదేవిధంగా ఒక వ్యక్తి తన వ్యక్తిగత విషయాలను అందరితోనూ పంచుకోకూడదని చాణక్యుడు చెబుతున్నాడు.

2.దాచుకోవడం...

కాకి తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే అవసరానికి ఉపయోగపడతాయేమో అని కొన్ని వస్తువులను కాకి ఎప్పుడూ దాచుకుంటూ ఉంటుంది. అదేవిధంగా, ఒక వ్యక్తి కష్ట సమయాల్లో ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకు డబ్బు, వనరులు, కావాల్సిన వస్తువులను దాచుకోవడం నేర్చుకోవాలి అని చాణక్య నీతి చెబుతోంది.

3.అప్రమత్తంగా ఉండటం...

కాకి ఎల్లప్పుడూ చురుకుగా ఉంటుంది. తన చుట్టూ పరిసరాలను గమనిస్తూ ఉంటుంది. జీవితంలో అజాగ్రత్తగా ఉండకూడదని, ప్రతి పరిస్థితిని వివేకంతో ఎదుర్కోవాలని కాకి నుంచి నేర్చుకోవాలి..

33
4.స్నేహితుల సపోర్ట్..

కాకి ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు, అది తన స్నేహితులను పిలుస్తుంది. అదేవిధంగా, మానవులు కష్ట సమయాల్లో ఒంటరిగా పోరాడకుండా, నమ్మకమైన వారి సపోర్ట్ తీసుకోవాలి..

5.ఆలోచించకుండా ఎవరినీ నమ్మద్దు...

ఒక కాకి వెంటనే ఎవరినీ నమ్మదు. ముందుగా వారిని పరీక్షిస్తుంది. ఈ పాఠం మనుషులు కూడా నేర్చుకోవాలి. అందరినీ గుడ్డిగా నమ్మడం వల్ల చాలా తొందరగా మోసపోయే ప్రమాదం ఉంది. అందుకే.. ముందు మనుషులను అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతే నమ్మడం అలవాటు చేసుకోవాలి..

Read more Photos on
click me!

Recommended Stories