Lifestyle
నీరు తాగితే మూత్ర విసర్జన వస్తుందని తెలిసిందే. అయితే మనలో చాలా మంది మూత్ర విసర్జన చేసిన వెంటనే నీరు తాగుతుంటారు. అయితే ఇది సరైన పద్ధతి కాదని మీకు తెలుసా.? ఇంతకీ ఇలా నీరు తాగితే వచ్చే సమస్యలు ఏంటి.? నీటిని తాగడానికి సరైన సమయం ఏంటి.? నిపుణులు ఏం చెబుతున్నారు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
drinking water
మూత్రవిసర్జన అనేది శరీరం నుంచి అనవసర పదార్థాలను బయటకు తొలగించే ఒక ప్రక్రియ. మూత్ర విసర్జన తర్వాత శరీరంలో తాత్కాలికంగా నీరు తగ్గిపోతుంది. మనం వెంటనే నీరు తాగితే, ఈ అసమతుల్యతను నిర్వహించడానికి శరీరం మరింత కష్టపడాల్సి ఉంటుంది, ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందుకే మూత్ర విసర్జన చేసిన వెంటనే నీటిని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
* మూత్ర విసర్జన తర్వాత, మూత్రపిండాలు వడపోత ప్రక్రియలో ఉంటాయి. వెంటనే నీరు త్రాగడం వల్ల మూత్రపిండాలు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఇది మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది.
* శరీరంలో సోడియం, పొటాషియం, ఇతర ఖనిజాల సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. మూత్ర విసర్జన చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల ఈ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది బలహీనతకు, తీవ్రమైన అలసటకు దారి తీస్తుంది.
* మూత్ర విసర్జన చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల కడుపులో ఆమ్లత్వం లేదా అజీర్ణం ఏర్పడుతుంది. ఇది క్రమేణ జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.
* తరచుగా మూత్ర విసర్జన చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి మీరు తరచుగా మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది. ఇది రాత్రి నిద్రకు కూడా భంగం కలిగించవచ్చు.
మూత్ర విసర్జన తర్వాత నీరు ఎప్పుడు తాగాలి.?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, మూత్ర విసర్జన తర్వాత కనీసం 10-15 నిమిషాలు విరామం తీసుకొని నెమ్మదిగా నీరు త్రాగాలి. ఇది శరీరం తనను తాను సమతుల్యం చేసుకోవడానికి సమయం ఇస్తుంది అలాగే మూత్రపిండాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగించదు. అయితే మూత్ర విసర్జన వెంటనే విపరీతమైన దాహం ఉంటే ఒకటి లేదా రెండు సిప్‌ల నీరు తాగాలి. అంతేకానీ ఎక్కువ మొత్తంలో మాత్రం తాగకూడదు.
నోట్: ఈ వివరాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినది. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.