సాధారణంగా ఫుడ్ హ్యాబిట్స్ సీజన్ ప్రకారం మారుతూ ఉంటాయి. వేసవిలో శరీరం వేడిగా ఉంటుంది. కాబట్టి చల్లని పదార్థాలు తినాలి. వేడి చేసేవి తినకూడదు. చాలామంది ఆరోగ్యంగా ఉండడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి వంటల్లో వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
వెల్లుల్లిలో ఉండే పోషకాలు:
వెల్లుల్లి వంటగదిలో వాడే ముఖ్యమైన పదార్థం. ఇది రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో విటమిన్ ఎ, బి, సి, ఐరన్, కొవ్వు, ప్రోటీన్లు ఉన్నాయి. ఇవి చాలా వ్యాధుల నుంచి కాపాడతాయి. శరీర ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తాయి.
వెల్లుల్లి వల్ల ఉపయోగాలు:
వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జలుబు, దగ్గు, ఆస్తమా లాంటి వాటికి బాగా పనిచేస్తుంది. రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలర్జీ, బ్యాక్టీరియా లక్షణాలు తలనొప్పి, మతిమరుపు, దంతాల నొప్పిని తగ్గిస్తాయి.
వేసవిలో వెల్లుల్లి వాడచ్చా?
వేసవిలో వెల్లుల్లిని ఎప్పటిలాగే వాడచ్చా అనే సందేహం కొందరికి ఉంటుంది. వేసవిలో వెల్లుల్లిని తక్కువగా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. కాబట్టి ఎక్కువగా తీసుకుంటే అలర్జీ వస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా తింటే శరీరం వేడెక్కి అసౌకర్యంగా ఉంటుంది.
వేసవిలో వెల్లుల్లి తింటే?
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఎక్కువగా తీసుకుంటే కాలేయానికి హాని చేస్తుంది. ముఖ్యంగా పచ్చి వెల్లుల్లి వేసవిలో తినడం అంత మంచిది కాదు. వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే కానీ, వేసవిలో ఎక్కువగా తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.