చిన్న పిల్లలకు గ్రీన్ టీ ఇవ్వడం మంచిదేనా?

First Published Oct 26, 2021, 12:40 PM IST

తల్లిదండ్రులు కాఫీ, టీలు తాగేప్పుడు తమకూ కావాలని పిల్లలు పేచీ పెడతారు. గ్రీన్ టీ విషయంలోనూ ఇది కనిపిస్తుంది. మరి childrenలకు గ్రీన్ టీ మంచిదేనా? green tea యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇది పిల్లలకు సురక్షితమేనా? అనేది ఓ సారి చూద్దాం.. 

children

పెద్దవాళ్లు ఏది చేస్తే చిన్నపిల్లలు అది చేయాలని ప్రయత్నిస్తుంటారు. పెద్దవాళ్లు తిన్నది తినాలని.. తాగింది తాగాలని.. చూస్తారు. దీనికి తగ్గట్టుగానే పెద్దవాళ్లు కూడా వారికి కాస్త కాస్త రుచి చూపించి మురిసిపోతుంటారు. 
 

రకరకాల ఆహారపదార్థాలు, పాలు, పండ్లు, మాంసం ఇలాంటివి ఈ లిస్టులో ఉంటాయి. అయితే చిన్నపిల్లలు తల్లిదండ్రులను ఎక్కువగా ఫాలో అయ్యేది. టీ, కాఫీల విషయంలో.. పాలు తాగమంటే మారాం చేసే చిన్నారులు.. టీ, కాఫీలకు మాత్రం ఆసక్తి చూపుతారు. 

తల్లిదండ్రులు కాఫీ, టీలు తాగేప్పుడు తమకూ కావాలని పిల్లలు పేచీ పెడతారు. గ్రీన్ టీ విషయంలోనూ ఇది కనిపిస్తుంది. మరి childrenలకు గ్రీన్ టీ మంచిదేనా? green tea యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇది పిల్లలకు సురక్షితమేనా? అనేది ఓ సారి చూద్దాం.. 

ఏది గ్రీన్ టీని ఆరోగ్యకరంగా మారుస్తుంది??

ఆరోగ్యం, ఫిట్‌నెస్ పట్ల పెరిగిన అవగాహన వల్ల.. పాలు, చక్కెర కలిసిన టీలకంటే మిగతా రకాల టీలకు గిరాకీ పెరిగింది. వాటిల్లో ఒకటే గ్రీన్ టీ. గ్రీన్ టీని ఆక్సిడైజ్ చేయని (పులియబెట్టని) ఆకుల నుండి తయారు చేస్తారు, ఇది పోషకాలు, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. అయితే ఇది అన్ని వయసుల వారికి, ముఖ్యంగా పిల్లలకు మంచిదా? అనేది తెలుసుకుందాం!

నిపుణులు ఏమి చెబుతారు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, గ్రీన్ టీలో తక్కువ మొత్తంలో 
Caffeine ఉంటుంది. అందుకే పిల్లలకు కనక కెఫిన్‌కు అలెర్జీ ఉంటే లేదా గ్రీన్ టీ తాగిన తర్వాత ఏదైనా తేడాగా అనిపిస్తే. రియాక్షన్ అవుతున్న లక్షణాలు కనిపిస్తే గ్రీన్ టీ ఇవ్వకపోవడమే మంచిది. 

గ్రీన్ టీ తీసుకోవడం అనేది పూర్తిగా శరీరం దానికి ఎలా ప్రతిస్పందిస్తుంది అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా, నిద్రలేమి, దృష్టి సారించలేకపోవడం లేదా పిల్లల్లో తేలికపాటి నుండి తీవ్రమైన హైపర్యాక్టివిటీ కనిపిస్తే.. కెఫిన్ ఆధారిత పానీయాలను నివారించడం ఉత్తమం. 

ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనిపించకపోయినట్లైతే ఒక చిన్న కప్పు గ్రీన్ టీలో తేనె, నిమ్మరసం కలిపి చిన్నారులకు ఇవ్వొచ్చు. దీనివల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపడడంతో పాటు, జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది.

మీ పిల్లల డైట్‌లో గ్రీన్ టీని జోడించడం ఎందుకు మంచిదంటే... 

జలుబు, ఫ్లూ
నిమ్మ, అల్లం, తేనె కలిపిన గ్రీన్ టీ కొద్ది మొత్తంలో ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో, అలెర్జీలు, సీజన్ మార్పు వల్ల వచ్చే జలుబు, దగ్గుకు వ్యతిరేకంగా నిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది. anti-inflammatory properties, antioxidants ఉండటం వల్ల గొంతు నొప్పి లేదా అలెర్జీల వల్ల కలిగే మంటను నయం చేయడంలో సహాయపడుతుంది.

దంతాలకు మంచిది
పిల్లలలో దంతాల కావిటీస్ సర్వసాధారణం, కానీ గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే సమ్మేళనం ఉండటం వల్ల cavityలకు కారణమయ్యే బ్యాక్టీరియా, సల్ఫర్ componentsకు వ్యతిరేకంగా పోరాడడంలో సహాయపడుతుంది. ఈ కాంపోనెంట్స్ నోటి దుర్వాసనకు దారితీస్తుంది.

జీర్ణక్రియకు మంచిది
 పిల్లలకు కేవలం 1 కప్పు గ్రీన్ టీ ఇవ్వడం వల్ల Digestion,  జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ రుచి, ఆరోగ్య గుణాన్ని పెంచడానికి దీంట్లో కొన్ని అల్లం లేదా సోపు గింజలను కలపొచ్చు. అల్లంతో గ్రీన్ టీని కలపడం వల్ల అపానవాయువు,అసౌకర్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే, పిల్లల ఆహారంలో మార్పులు చేసేముందు ఓ సారి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. 

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి... బాడీ అంత ఫ్లెక్సిబుల్ ఎలా ఉంటుందో తెలుసా..?

click me!